నందమూరి నటసింహం బాలకృష్ణ( Balakrishna ) ప్రజెంట్ మంచి ఊపు మీద ఉన్నారు.ఇదే ఊపులో మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు.
బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ ఏవైటెడ్ మూవీ ”భగవంత్ కేసరి”.( Bhagavanth Kesari ) ఈ సినిమా తోనే హ్యాట్రిక్ హిట్ అందుకోవాలని ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు.
వరుసగా రెండు హిట్స్ ను తన ఖాతాలో వేసుకుని బాలయ్యతో పాటు ఫ్యాన్స్ కూడా హుషారుగా ఉన్నారు.అఖండ, వీరసింహారెడ్డి సినిమాలు రెండు కూడా మంచి విజయం సాధించాయి.
ఇక ఇప్పుడు ఆ సినిమా విజయంతో భగవంత్ కేసరి సినిమాపై ముందు నుండి అంచనాలు బాగా పెరిగాయి.ఇప్పటికే వచ్చిన ప్రతీ ప్రమోషనల్ కంటెంట్ కూడా ఆడియెన్స్ ను బాగా అలరించింది.

దీంతో ఈ సినిమాపై ఇంకా ట్రైలర్ కూడా రాకుండానే హోప్స్ పెరిగి పోయాయి.ఇక తాజాగా బుక్ మై షోలో( Book My Show ) భగవంత్ కేసరి మ్యానియా కనిపిస్తుంది.ఈ చిత్రం లక్ష 23 వేల లైక్స్ తో ఆడియెన్స్ లో ఏ రేంజ్ లో ఆసక్తిగా ఉన్నారో చెప్పకనే చెప్పారు.ఇక రిలీజ్ దగ్గర పడే కొద్దీ ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరగడం ఖాయం.
కాగా రేపు అక్టోబర్ 8న ఈ సినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.

కాగా దసరా కానుకగా అక్టోబర్ 19న ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ఇందులో బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్( Kajal Agarwal ) నటిస్తుండగా కూతురు రోల్ లో శ్రీలీల,( Sreeleela ) విలన్ గా బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్ నటిస్తున్నారు.ఇక ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించగా థమన్ సంగీతం అందించారు.







