మీరు తరచూ గూగుల్ మ్యాప్స్( Google Maps ) వాడుతున్నట్టైతే అందులో వచ్చే యాడ్స్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు.అయితే ఇకపై అలాంటివి మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా వుండడానికి సింపుల్ టెక్నిక్ వాడితే సరిపోతుంది.
ఇక్కడ ఈ సెట్టింగ్స్ ఓసారి మీ ఫోన్లో యాక్టివేట్ చేసుకుంటే చాలు.ఇక మీకు యాడ్స్( Ads ) చూద్దామన్నా కనిపించవు.
గూగుల్ మ్యాప్స్ లో వ్యాపార ప్రకటనలను ఎలా ఆఫ్ చేయాలో ఇప్పుడు చూద్దాం.ముందుగా దీనికోసం మీ స్మార్ట్ ఫోన్ సెట్టింగ్‌లను ఓపెన్ చేయాలి.
ఆ తర్వాత కిందికి స్క్రోల్ చేసి గూగుల్ పైన క్లిక్ చేసి తరువాత మీరు గూగుల్ అకౌంట్ను ఎంచుకోవాలి.ఆ తర్వాత కిందికి స్క్రోల్ చేసి ‘పర్సనలైజ్ యూజింగ్ షేర్ డేటా’( Personalize Using Share Data ) అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి.

ఆ తరువాత ఓపెన్ అయిన పేజీలో మ్యాప్స్ అని ఉన్న టోగుల్ను ఆఫ్ చేసి, తర్వాత మీరు గూగుల్ మ్యాప్స్ ని ఓపెన్ చేసి యాడ్స్ వస్తున్నాయో లేదో చెక్ చేసుకోవచ్చు.సాధారణంగా బిజినెస్ ప్రమోట్ చేయడానికి నావిగేషన్ సమయంలో ప్రకటనలను చూపిస్తుంటాయి.ఇలా సెట్ చేసుకోవడం ద్వారా మీకు సమీపంలోని వ్యాపారాలను, స్థలాలను చూపే యాడ్స్, సెర్చింగ్లో స్థలాలను ఆటోమెటిక్గా సూచించడం లాంటివి ఆఫ్ చేయబడవు అనే విషయం మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి.

అది కూడా కాకపోతే ఈ ప్రకటనలు మీకు ఇబ్బంది కలిగించేవిగా అనిపిస్తే.మీరు యాడ్ పర్సనలైజేషన్ పూర్తిగా నిలిపి వేయవచ్చు కూడా.దానిని మీ ఫోన్లో ఎలా సెట్ చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
దానికోసం మీరు ముందుగా మీ బ్రౌజర్‌లో మై అకౌంట్ గూగుల్.కామ్ సందర్శించాలి.
ఆ తర్వాత కిందికి స్క్రోల్ చేసి యాడ్ పర్సనలైజేషన్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి.అనంతరం ఓపెన్ అయిన పేజీలో యాడ్ పర్సనలైజేషన్ అని ఉన్న టోగుల్‌ని ఆఫ్ చేయాలి.
చివరగా టర్న్ ఆఫ్ పై క్లిక్ చేస్తే మీ ఫోన్లో ఇకపై అలాంటి యాడ్స్ కనిపించవు.తద్వారా మీరు ఫ్రీగా వుండవచ్చు.







