సౌత్ లో ఇప్పుడు సినీ ప్రేక్షకులు మరియు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఒకటి ‘లియో’.( Leo Movie ) తమిళ హీరో విజయ్ నటించిన ఈ సినిమా కోసం తమిళ ఆడియన్స్ ఎంతలా ఎదురు చూస్తున్నారో, తెలుగు ఆడియన్స్ కూడా అంతలా ఎదురు చూస్తున్నారు.
ఎందుకంటే ఆ చిత్ర దర్శకుడు లోకేష్ కనకరాజ్( Lokesh Kanagaraj ) తీసిన సినిమాలు అలాంటివి మరి.ఆయన దర్శకత్వం లో వచ్చిన గత చిత్రం ‘విక్రమ్’ కమర్షియల్ గా పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యింది.దాంతో ఈ చిత్రం పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.ఇక రీసెంట్ గా విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్ కి కూడా ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
ఇకపోతే అతి త్వరలోనే ఈ చిరానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని తెలుగు లో నిర్వహించబోతున్నారు.

ఈ సినిమా తెలుగు రైట్స్ ని ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగవంశీ ( Surya Devara Nagavamsi ) తీసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.తమిళం లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కొన్ని కారణాల వల్ల క్యాన్సిల్ అవ్వడం తో, తెలుగు లో ఎంతో గ్రాండ్ గా చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాడు వంశీ.అందులో భాగంగానే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని( Pawan Kalyan ) పిలిచే ఆలోచనలో ఉన్నాడట నిర్మాత వంశీ.
పవన్ కళ్యాణ్ వంశీ కి ఎంతో మంచి సన్నిహితుడు అనే విషయం మన అందరికీ తెలిసిందే.వంశీ ఎన్నో సందర్భాలలో కళ్యాణ్ గారు మా కుటుంబ సభ్యుడు అని చెప్పాడు కూడా.
దానికి తోడు హీరో విజయ్( Vijay Thalapathy ) కూడా పవన్ కళ్యాణ్ కి పెద్ద ఫ్యాన్.ఈ విషయం స్వయంగా ఆయనే చెప్పాడు.

ఇకపోతే విజయ్ ఇప్పటి వరకు తన సినిమాలకు సంబంధించి ఒక్కసారి కూడా తెలుగు ప్రొమోషన్స్ లో పాల్గొనలేదు.ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని ముఖ్య అతిథిగా పిలవబోతున్నాము అని నాగవంశీ చెప్పగానే కచ్చితంగా నేను కూడా వస్తాను అని మాటిచ్చాడట విజయ్.తెలుగు లో పవన్ కళ్యాణ్ మరియు విజయ్ ని ఇష్టపడే అభిమానులు ఎంతో మంది ఉన్నారు.వాళ్లందరికీ సౌత్ లో ఈ ఇద్దరు బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ ని చూస్తే పండగే అని చెప్పొచ్చు.
ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.







