నందమూరి నటసింహం బాలకృష్ణ( Balakrishna ) ప్రజెంట్ మంచి ఊపు మీద ఉన్నారు.వరుసగా రెండు హిట్స్ ను తన ఖాతాలో వేసుకుని హ్యాట్రిక్ కోసం సిద్ధం అయ్యాడు.
బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ ఏవైటెడ్ మూవీ ”భగవంత్ కేసరి’‘( Bhagavanth Kesari ).ఈ సినిమా తోనే హ్యాట్రిక్ హిట్ అందుకోవాలని ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు.అయితే భగవంత్ కేసరి నుండి ఇప్పటి వరకు సాలిడ్ ప్రొమోషన్స్ అనేవి లేవు.దీంతో ఈ సినిమాపై భారీ హైప్ అనేది క్రియేట్ అవ్వలేదు.ఇక నందమూరి ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడు ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తారా అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూడగా ఇప్పుడిప్పుడే ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచేశారు మేకర్స్.రిలీజ్ కు ఇంకా 15 రోజులు మాత్రమే ఉంది.
దీంతో ఈ సినిమాపై మరింత క్రేజ్ పెంచేలా ప్రమోషన్స్ విషయంలో ముందుకు వెళుతున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ఆకట్టుకోగా ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ కు మేకర్స్ ముహూర్తం ఫిక్స్ చేసారు.ఈ ట్రైలర్ ను అక్టోబర్ 8న రిలీజ్ చేస్తున్నట్టు తాజాగా మేకర్స్ అఫిషియల్ గా కన్ఫర్మ్ చేసారు.ఇక ఈ రోజు ఈ ట్రైలర్ రిలీజ్ పై మరో అప్డేట్ తెలిపారు.
ఈ సినిమా ట్రైలర్ కోసం ఒక వెన్యూ కూడా ఫిక్స్ చేసినట్టుగా మేకర్స్ రివీల్ చేసారు.ఈ ట్రైలర్ లాంచ్ ను యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ హన్మకొండ వరంగల్ లో గ్రాండ్ గా లాంచ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేస్తూ అఫిషియల్ అప్డేట్ ఇచ్చారు.
దీంతో భగవంత్ కేసరి రచ్చ అక్కడి నుండే స్టార్ట్ కాబోతున్నట్టు తెలుస్తుంది.
కాగా దసరా కానుకగా అక్టోబర్ 19న ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ఇందులో బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్( Kajal Agarwal ) నటిస్తుండగా కూతురు రోల్ లో శ్రీలీల( Sreeleela ) విలన్ గా బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్ నటిస్తున్నారు.ఇక ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించగా థమన్ సంగీతం అందించారు.