న్యూజిలాండ్ తరఫున ఇంగ్లాండుకు చుక్కలు చూపించిన రచిన్ రవీంద్ర మన భారత కుర్రాడే..!

వన్డే వరల్డ్ కప్ టోర్నీ తొలి మ్యాచ్లో న్యూజిలాండ్( New Zealand ) తరఫున బ్యాటింగ్ చేసి, మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించి, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్న రచిన్ రవీంద్ర( Rachin Ravindra ) మన భారత కుర్రాడే.న్యూజిలాండ్ తరఫున బరిలోకి మొదటి అంతర్జాతీయ సెంచరీ చేసి సరికొత్త రికార్డు సృష్టించాడు.23 ఏళ్ల రచిన్ రవీంద్ర 96 బంతుల్లో ఒక ఫోర్, ఐదు సిక్సర్లతో 123 పరుగులతో ఇంగ్లాండ్ బౌలర్లపై చెలరేగాడు.ఓపెనర్ డెవాన్ కాన్వే తో కలిసి రెండో వికెట్ కు 273 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు.

 World Cup 2023 Who Is Rachin Ravindra Named After Sachin Tendulkar And Rahul Dra-TeluguStop.com

ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా రవీంద్ర పేరు మారుమోగుతూ.క్రికెట్ ఫ్యాన్స్ మధ్య చర్చ నడుస్తోంది.

Telugu Cricketerrachin, Zealand, Rachin Ravindra, Rahul Dravid, Ravikrishna, Ten

రచిన్ రవీంద్ర ఎవరు.భారత్ కు చెందిన ఇతను ఎందుకు న్యూజిలాండ్ తరఫున ఆడుతున్నాడు అనే విషయాలు తెలుసుకోవడం కోసం క్రికెట్ అభిమానులు ప్రయత్నం చేస్తున్నారు.రచిన్ రవీంద్ర తల్లిదండ్రులు భారతదేశంలోని బెంగుళూరుకు చెందిన వాళ్లు.రచిన్ రవీంద్ర తండ్రి రవి కృష్ణమూర్తి( Ravi Krishnamurthy ) 1990లో న్యూజిలాండ్ లో స్థిరపడ్డాడు.రచిన్ రవీంద్ర న్యూజిలాండ్ లోనే జన్మించాడు.రవీంద్ర కు చిన్నప్పటినుండి క్రికెట్ అంటే ఎంతో ఇష్టం.

కొడుకుకు క్రికెట్ పట్ల ఉన్న ఆసక్తి గమనించిన అతని తండ్రి ప్రత్యేకంగా క్రికెట్ కోచింగ్ ఇప్పించాడు.ఇతను న్యూజిలాండ్ కు చెందిన సిటిజన్ అయినప్పటికీ క్రికెట్ ట్రైనింగ్ మాత్రం ఆంధ్రప్రదేశ్లోని అనంతపూర్ లో( Anantapur ) ఉండే రూరల్ డెవలప్మెంట్ ట్రస్టులో ట్రైనింగ్ పొందాడు.

Telugu Cricketerrachin, Zealand, Rachin Ravindra, Rahul Dravid, Ravikrishna, Ten

అక్కడి స్థానిక క్రికెట్ టోర్నీలో కూడా ఆడేవాడు.2021లో భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ తో న్యూజిలాండ్ తరఫున ఆరంగేట్రం చేశాడు.రచిన్ రవీంద్ర తండ్రి భారత మాజీ స్టార్ క్రికెటర్లైన సచిన్ టెండుల్కర్,( Sachin Tendulkar ) రాహుల్ ద్రావిడ్లకు( Rahul Dravid ) వీరాభిమాని.ఈ క్రికెటర్ల పేర్లు కలిసొచ్చేలా తన కొడుకుకు రచిన్ రవీంద్ర అని పేరు పెట్టాడు.

అంటే రాహుల్ ద్రావిడ్ లో “ర”, సచిన్ టెండూల్కర్ లో “చిన్” అనే అక్షరాలు తీసుకొని రచిన్ రవీంద్ర అనే పేరు పెట్టాడు.రచిన్ రవీంద్ర క్రికెట్ కెరియర్ విషయానికి వస్తే.

ఇప్పటివరకు మూడు టెస్ట్ మ్యాచ్లు, 12 వన్డేలు, 18 టీ20 మ్యాచ్లు ఆడాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube