“వరకట్నం సాంఘిక దురాచారం” అనే దానిమీద ఎన్నో ఏళ్ల క్రితం ‘వరవిక్రయం’( Varavikrayam ) అనే నాటకం వచ్చింది.పశ్చిమగోదావరి జిల్లావాసి ‘కాళ్లకూరి నారాయణరావు’( Kallakuri Narayanarao ) గారు ఓ దశబ్దకాలం కిందట రాసిన నాటకం ఇది.
ఈ నాటకం రాయకపోయి ఉంటే తెలుగు నాటకరంగం అనే ముత్యాలదండలో ఒక మణిపూస మిస్ అయ్యేది అనడంలో సందేహమే లేదు.కధ విషయంలోకి కాస్త వెళితే… అది ఓ ఇద్దరు ఆడపిల్లలున్న ఇల్లు.
అందమైన సంసారం.పెద్ద పిల్ల పెళ్లీడుకు వచ్చింది.
వరుడు కోసం వెతకాలి.తల్లిదండ్రులు వెతగ్గా వెతగ్గా ఒకడు దొరికుతాడు.
పిల్లకు సరియైన జోడినే.కానీ అతని తండ్రి పరమ పిసినారి.
కట్నం కింద 5000 రూపాయిలు ఇవ్వక తప్పలేదు వారికి.అయితే ఆ విషయం ఆ పెళ్లి కూతురికి అస్సలు నచ్చలేదు.
అక్కడే వచ్చింది అసలు చిక్కు.
విషయం యేమిటంటే ఐదు వేల కోసం ఉన్న పొలాన్ని అమ్మారన్న సంగతి తెలిసి ఆమె చాలా బాధపడుతుంది.
దాంతో ఎలాగైనా ఆ పెళ్లి ఆపాలని దేవుడి మీద భారం వేసి, నూతిలో దూకి ప్రాణాలు తీసుకుంటుంది.ఇంతజరిగినా ఆ మొగపెళ్లి వారికి అంత భారీ కట్నం( Dowry ) పోగొట్టుకోవడం ఇష్టం వుండదు.
దానికి సరియైన ప్లాన్ వేస్తారు.రెండో పిల్లని వారి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయమని అడుగుతారు.
దానికి పిల్ల తల్లిదండ్రులు సరేనని పెళ్లిచేస్తారు.అలా రెండేళ్లు గడిచిపోతుంది.
ఆ పిల్ల కాపురానికి వెళ్ళదు.దానికి ఆమె మామకు చాలా అసహనంగా వుంటుంది.
ఎందుకంటే ఆమెకు తమ తరఫున పెట్టిన నగల మిస్ అవుతున్నాయని ఫీల్ అవుతాడు.వాటిని తిరిగి తెచ్చుకుని, తన కొడుక్కి మరో పెళ్లి చేయాలని ఆలోచన చేస్తాడు.విషయం కోర్టు దాకా వెళుతుంది.దానికి ఆ పెళ్లి కూతురు “నేను బోలెడంత కట్నం పోసి వరుణ్ని కొనుక్కున్నాను. అతనే నా ఇంటికి రావాలి” అని అడుగుతుంది.దానికి అబ్బాయి తల వంచుతాడు.
ఈ క్రమంలో తన తండ్రి నీచబుద్ధి బయట పెడతాడు.భార్య మాట అంగీకరించాడు.
న్యాయమూర్తి కూడా వారికి అనుకూలంగా తీర్పు ఇస్తాడు.కథ ముగుస్తుంది.
ఎంత మంచి కధ.ఎన్ని విలువలున్న కధలు వచ్చేవి అప్పట్లో.దాదాపుగా అప్పుడన్ని నాటకాలను బేస్ చేసుకొనే సినిమాలుగా ఆ తరువాతకాలంలో వచ్చేవి.దానికి ఓ చక్కని ఉదాహరణే మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) నటించి మెప్పించిన ‘శుభలేఖ’ సినిమా.
( Subhalekha Movie ) ఆ సినిమా కధలు ఈ నాటకమే ప్రేరణ అని సినిమా చూసిన ఎవరికైనా అర్ధం అవుతుంది.ఇప్పుడు అటువంటి కధాబలం వున్న సినిమాలు దాదాపు శూన్యం.
కానీ అప్పట్లో అలా వుండేది కాదు.ఒక సినిమా నిర్మాణం అనేది సమాజం పట్ల ఎంతో బాధ్యతతో కూడుకొని జరిగేది.
మరోసారి మరో కధతో కలుద్దాం.