అమెరికా ప్రతినిధుల స్పీకర్ కెవిన్ మెక్‌కార్దీని( Kevin McCarthy ) అవిశ్వాస తీర్మానం ద్వారా పదవి నుంచి తొలగించిన సంగతి తెలిసిందే.దీంతో అమెరికన్ రాజకీయాలు వేడెక్కాయి.
అధ్యక్ష ఎన్నికలకు ముందు ఈ పరిణామం రెండు పార్టీలపైనా ప్రభావం చూపే అవకాశం వుంది.మరి తదుపరి స్పీకర్ ఎవరు.
అన్న చర్చ దేశవ్యాప్తంగా జరుగుతోంది.అమెరికాలో అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు తర్వాత శక్తివంతమైన పదవి స్పీకర్‌దే.
ఇలాంటి ఉన్నత పదవిని అందుకునేందుకు చాలామంది పోటీ పడే అవకాశం వుంది.సభలో మెజారిటీ నేపథ్యంలో కొంచెం కష్టపడితే మరోసారి రిపబ్లికన్లకే ఆ పదవి దక్కుతుంది.
కొత్త స్పీకర్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభించేందుకు పార్టీ సిద్ధమవుతున్న నేపథ్యంలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.( Donald Trump ) హౌస్ రిపబ్లికన్లతో భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
2024 అధ్యక్ష ఎన్నికల బరిలో వున్న ట్రంప్.రిపబ్లికన్ పార్టీలో( Republican Party ) ఈ పదవి కోసం పోటీపడుతున్న అందరిలోకీ ముందంజలో వున్నారు.
కొత్త స్పీకర్ ఎన్నికపై చర్చించేందుకు వచ్చే మంగళవారం క్యాపిటల్ హిల్‌లో హౌస్ రిపబ్లికన్లు సమావేశం కానున్నారు.ఈ కీలక భేటీకి హాజరయ్యేందుకు ట్రంప్ నిర్ణయించుకున్నట్లుగా కథనాలు వస్తున్నాయి.
నిర్ణయాన్ని ప్రభావితం చేసేలా ట్రంప్ చేస్తున్న బహిరంగ యత్నాలు స్పీకర్( Speaker ) పదవి కోసం యుద్ధానికి దారి తీసేలా వుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రస్తుతానికి లూసియానాకు చెందిన స్టీవ్ స్కాలిస్,( Steve Scalise ) ఒహియోకు చెందిన జిమ్ జోర్డాన్‌లు( Jim Jordan ) తాము స్పీకర్ పదవిని కోరుతున్నట్లుగా ప్రకటించారు.ట్రంప్ ఎవరివైపు వుంటారన్నది ఇక్కడ చర్చనీయాంశమైంది.తాత్కాలిక స్పీకర్‌గా విధులు నిర్వర్తిస్తున్న పాట్రిక్ మెక్‌హెన్రీ . స్పీకర్ ఎన్నికలు నిర్వహించేందుకు అక్టోబర్ 11ని నిర్ణయించారు.అయితే అదే రోజున ట్రంప్ ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్‌లో ర్యాలీ నిర్వహించాల్సి వుంది.
మెక్ కార్తీని తొలగించాలని అవిశ్వాస తీర్మానం పెట్టిన ఫ్లోరిడా ప్రతినిధి మాట్ గేట్జ్ ఈ కార్యక్రమంలో ప్రసంగించనున్నారు.

మరోవైపు.స్పీకర్ రేసులో ట్రంప్ పేరు కూడా వినిపించింది.దీనిపై మీడియా ప్రతినిధులు ఆయనను ప్రశ్నించగా.
రిపబ్లికన్ పార్టీకి ఏది మంచిదో అదే చేస్తానని పేర్కొన్నారు.అలాగే పార్టీలో ఎంతోమంది ప్రముఖులు వున్నారని.
ప్రస్తుతం తన దృష్టి అధ్యక్ష ఎన్నికలపైనే వుందన్నారు.కానీ రిపబ్లికన్ పార్టీ నిబంధనల ప్రకారం.
తీవ్రమైన నేరారోపణలను ఎదుర్కొంటున్న వారు ఏ సభకూ నాయకత్వం వహించడానికి వీల్లేదు.







