పవన్ విషయంలో జగన్ మైండ్ గేమ్.. ప్రముఖ జర్నలిస్ట్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.చంద్రబాబు( Chandrababu ) అరెస్ట్ జరిగి దాదాపుగా నెలరోజులు కాగా మరి కొందరు టీడీపీ నేతలు రాబోయే రోజుల్లో అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

 Imandi Ramarao Shocking Comments Goes Viral In Social Media Details Here Goes Vi-TeluguStop.com

లోకేశ్ ను రాబోయే రోజుల్లో అరెస్ట్ చేసే అవకాశాలు ఉండగా ఛాన్స్ దొరికితే పవన్ ను కూడా అరెస్ట్ చేయాలని వైసీపీ( YCP ) భావిస్తోంది.అయితే పవన్ ను జైలులో వేస్తే వైసీపీకి జరగబోయేది ఇదే అంటూ ఇమంది రామారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

రోజా( Roja ) కూడా ఎన్నో కామెంట్లు చేశారని ఆ కామెంట్లకు ఆధారాలు చూపించగలరా అని ఇమంది రామారావు ( imandi ramarao )అన్నారు.పవన్ గతంలో ఎదురైన అనుభవాల ఆధారంగా కొన్ని కామెంట్లు చేసి ఉండవచ్చని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఏపీ సీఎం వైఎస్ జగన్( AP CM YS Jagan ) మైండ్ గేమ్ ఆడతారని మైండ్ గేమ్ ఆడి నిజం చేస్తారని ఆయన అన్నారు.పవన్ ను అరెస్ట్ చేయడం జరగదు కానీ పార్టీలో నిరుత్సాహం వచ్చేలా చేస్తున్నారని ఇమంది రామారావు కామెంట్లు చేశరు.

పవన్ ప్యాకేజ్ తీసుకోవడం ఎవరైనా చూశారా అని ఆయన ప్రశ్నించారు.పవన్ వ్యక్తిగత జీవితం గురించి కామెంట్లు చేసే హక్కు వైసీపీ వాళ్లకు ఏముందని ఆయన కామెంట్లు చేశారు.జగన్ కుటుంబ సభ్యులను కించపరిచేలా మాట్లాడితే సైలెంట్ గా ఉంటారా అని ఆయన చెప్పుకొచ్చారు.టీడీపీకి సింపతీ పెరుగుతుందని ఇమంది రామారావు అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.

వార్డ్ మెంబర్ గా కూడా గెలవలేడని పవన్ పై విమర్శలు చేస్తున్న వాళ్లు పవన్ కు ఎందుకు భయపడుతున్నారని ఇమంది రామారావు ప్రశ్నించారు.ఇమంది రామారావు చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

ఇమంది రామారావు కామెంట్లపై వైసీపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube