తిరుపతిలో జంట హత్యల కలకలం

తిరుపతిలో జంట హత్యల కలకలం చెలరేగింది.ఓ హోటల్ లో భార్య, బావమరిదిని భర్త హత్య చేశాడు.

 Double Murders In Tirupati-TeluguStop.com

అనంతరం నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు.

దీంతో హత్యలపై కేసు నమోదు చేసిన పోలీసులు మహారాష్ట్రలోని నాందేడ్ కు చెందిన కుటుంబంగా గుర్తించారు.

నిన్న తిరుమల శ్రీవారి దర్శనం నిమిత్తం అన్నాచెల్లెలు హర్షవర్ధన్, మనీషా తిరుపతికి వచ్చారు.ఈ క్రమంలోనే హోటల్ లో ఉన్న వారిని భర్త యువరాజ్ హత్య చేశాడు.

అనంతరం అలిపిరి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడని పోలీసులు తెలిపారు.కాగా హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

అయితే నిన్న రాత్రి నుంచి వీరి గదుల్లో పెద్ద ఎత్తున గొడవ జరిగినట్లు హోటల్ సిబ్బంది చెబుతున్నారని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube