నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna ) అన్ స్టాపబుల్ మూడవ సీజన్ కి రెడీ అయ్యాడు.కొన్ని గంటల ముందు ఆహా వారిని కలిసి మూడవ సీజన్ కి సంబంధించిన ఒప్పందం పై సంతకాలు చేయడం జరిగింది.
గత రెండు సీజన్ లతో పోల్చితే పారితోషికం విషయం లో ఇంకాస్త ఎక్కువ అన్నట్లుగా బాలయ్య అందుకుంటున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.అన్ స్టాపబుల్ ( Unstoppable )మూడవ సీజన్ గురించి చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి.
మూడవ సీజన్ మొదటి ఎపిసోడ్ లో మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) హాజరు అవ్వబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి.సీజన్ 2 లోనే చిరంజీవి కనిపించాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల చిరంజీవిని తీసుకు రాలేక పోయారు.
మూడవ సీజన్ కి చ్చితంగా చిరంజీవి మిస్ అవ్వడు అని అంతా నమ్మకంతో ఉన్నారు.

ఇలాంటి సమయంలో అనూహ్యంగా అన్ స్టాపబుల్ మొదటి ఎపిసోడ్ ను మరో స్టార్ తో షూట్ చేసేందుకు రెడీ అవ్వడంతో ఫ్యాన్స్ నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.భోళా శంకర్( Bhola Shankar ) వంటి డిజాస్టర్ తర్వాత బాలయ్య ముందు కూర్చోవడం చిరంజీవికి ఇష్టం లేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే.కొందరు మాత్రం చిరు ఏదైనా సినిమా ప్రమోషన్ ఉంటే షో లో హాజరు అయ్యేందుకు ఓకే చెప్తాడు.
అంతే కానీ ఇప్పుడు ఏ సినిమా ప్రమోషన్ లేకుండా బాలయ్య షో కి వెళ్లాల్సిన అవసరం ఏంటి అన్నట్లుగా చిరు ఫ్యాన్స్ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అయితే కొందరు మెగా ఫ్యాన్స్ మరియు నందమూరి ఫ్యాన్స్ మాత్రం అన్ స్టాపబుల్ లో మొదటి ఎపిసోడ్ చిరంజీవిది కాదు అని తెలిసి తెగ ఫీల్ అవుతున్నారు.
ఇది వారికి అతి పెద్ద బ్యాడ్ న్యూస్ అంటూ చర్చ జరుగుతోంది.చిరు ని అన్ స్టాపబుల్ లో ఎప్పుడెప్పుడు చూస్తామా అంటూ చాలా మంది ఎదురు చూస్తున్నారు.







