కాలం మారింది.ఈరోజు రేపు మహిళలలు( Women ) కూడా పురుషులకు ధీటుగా వివిధ రంగాల్లో తమ సత్తాని చాటుతున్నారు.
ఈ క్రమంలో వారితో సమానంగా అన్నింటిలోనూ సమాన హక్కులు ఉండాలని పోరాటం చేస్తున్నారు కూడా.అయితే పురుషులకు ఎందులోనూ మేము తీసిపోం అని చాటి చెప్పడానికి యత్నిస్తున్న స్త్రీలు ఇంకా పదోన్నోతుల్లో పురుషులకంటే వెనకబడి వున్నారని స్పస్టమౌతోంది.
అమెరికన్ సాంకేతిక అధికారి షెరిల్ శాండ్‌బర్గ్, లెర్న్ ఇన్ డాట్ ఆర్గనైజేషన్, మిక్నిసే అండ్ కో సంయుక్తంగా నిర్వహించిన విమెన్ ఇన్ ది వర్క్ ప్లేస్( Women in the Workplace ) నివేదికలు దానికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి.

వారు చేసిన సర్వే ప్రకారం 2022లో పదోన్నతులు పొందిన ప్రతి వంద మంది పురుషుల్లో కేవలం 87 మంది మహిళలు మాత్రమే ఆ ప్రోత్సాహాన్ని పొందినట్టు తెలుస్తోంది.పురుషులతో సమానంగా ప్రమోషన్లు పొందాలని కోరినప్పటికీ అందులో వారు ఇంకా వెనుకబడే ఉన్నట్లు ఆ సర్వే పేర్కొంది.ఈ క్రమంలో మీకు మీరుగా మీ సామర్థ్యాన్ని ప్రూవ్ చేసుకోనట్లయితే వెనుకబడక తప్పదని స్త్రీలని వుద్దేశించి శాండ్‌బర్గ్ సర్వే ( Sandberg Survey )వెల్లడించింది.
ఇక నల్లజాతీయుల పరంగా కూడా అక్కడి స్త్రీల మరీ పరిస్థితి దారుణంగా ఉందని తెలుస్తోంది.ప్రతి వంద మంది పురుషులకు కేవలం 54 మంది నల్లజాతీయులు పదోన్నతులు పొందుతున్నట్లు సర్వే తెలిపింది.

యూఎస్, కెనడాలలో సుమారు 276 కంపెనీలపై సర్వే చేయగా దాదాపు 33 సంస్థలు నుంచి 27 వేలకు పైగా ఉన్న ఉద్యోగుల్లో మహిళలతో పోలిస్తే పురుషులే ఎక్కువ ప్రమోషన్లు పొందినట్టు నివేదిక వెల్లడించింది.మెటా ఫ్లాట్‌ఫారమ్ మాజీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ శాండ్‌బర్గ్ ఈ విషయం మీద మాట్లాడుతూ.మహిళలే పనితీరులో కాస్త నిర్లక్ష్యంగా ఉంటూ అసంతృప్తిగా పనిచేస్తున్నారని చెప్పుకు రావడం కొసమెరుపు.ఇలా ఉంటే మహిళలు వారు ఆశించిన లక్ష్యాన్ని ఎలా చేరుకొనగలరు అని ప్రశ్నిస్తున్నాయి నివేదికలు.







