దాదాపు 50 లక్షలమంది టెకీలు ఈ టాప్‌ కంపెనీలలోనే వర్క్ చేస్తున్నారట?

అవును, మీరు విన్నది నిజమే.ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 50 లక్షలమంది టెకీలు ఈ టాప్‌ కంపెనీలలోనే వర్క్ చేస్తున్నారని తాజా సర్వేలు వెల్లడించాయి.

 Almost 50 Lakh Techies Are Working In These Top Companies, Almost , Technology N-TeluguStop.com

ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే టెక్‌ జాబ్‌లకు ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదని చెప్పుకోవాలి.ఎందుకంటే మంచి వేతన ప్యాకేజీలు, మెరుగైన లైఫ్‌ స్టైల్‌ కారణంగా చాలా వీటిని డ్రీమ్‌ జాబ్స్‌ గా నేటి యువత సగం మందికి పైగా భావిస్తున్నారు.

ఇలాంటి టెక్‌ జాబ్‌లు కల్పించే టెక్నాలజీ కంపెనీలు ప్రపంచ వ్యాప్తంగా అనేకం వున్నాయని అందరికీ తెల్సిందే.అయితే ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కంపెనీలు వున్నప్పటికీ కేవలం 10 కంపెనీల్లోనే సుమారు అరకోటి మందికిపైగా టెకీలు పనిచేస్తున్నారని సమాచారం.

Telugu Ups, Top-Latest News - Telugu

అవును, టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా( Times of India ) అనుబంధ సంస్థ గ్యాడ్జెట్స్‌ నౌ నివేదిక ప్రకారం.అత్యధికంగా ఉద్యోగాలు కల్పిస్తున్న టాప్‌ 10 టెక్నాలజీ కంపెనీల లిస్ట్ గురించి తెలుసుకుందాం.ఈ లిస్టులో అగ్ర స్థానంలో వుంది ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌( Amazon ).అవును, అమెజాన్‌ సుమారు 1,461,000 మంది ఉద్యోగులతో అగ్రస్థానంలో వెలుగొందుతోంది.ఈ కంపెనీకి చెందిన క్లౌడ్ కంప్యూటింగ్, అమెజాన్ వెబ్ సర్వీసెస్‌తో సహా వివిధ విభాగాల్లో ఈ ఉద్యోగులు పనిచేస్తున్నారు.ఇక రెండవ స్థానంలో యాపిల్‌ కంపెనీ వుంది.

దీనికి సంబంధించిన అతిపెద్ద ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ తయారీదారుగా ప్రసిద్ధి చెందిన ఫాక్స్‌కాన్ ( Foxconn ) 826,608 మంది ఉద్యోగులతో రెండవ స్థానంలో నిలిచింది.

Telugu Ups, Top-Latest News - Telugu

ఆ తర్వాతి స్థానంలో ఐటీ కన్సల్టెన్సీ దిగ్గజం యాక్సెంచర్ ( Accenture ) సుమారు 738,000 మంది ఉద్యోగులతో మూడవ స్థానంలో కొనసాగుతోంది.అదేవిధంగా భారతదేశపు అతిపెద్ద ఐటీ సేవల సంస్థ అయినటువంటి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ( TCS ) 614,795 మంది గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌ కలిగి వుందని తాజా సర్వే వెల్లడించింది.ఆ తరువాత ఫ్రాన్స్‌ కు చెందిన టెలిఫర్ఫార్మెన్స్ ( Teleperformance ) ప్రపంచ వ్యాప్తంగా 410,000 మంది ఉద్యోగులతో, యునైటెడ్ స్టేట్స్‌కు చెందిన కాగ్నిజెంట్‌ ( Cognizant ) 351,500 మంది ఉద్యోగులతో, మరో భారతీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ ( Infosys ) ప్రపంచ వ్యాప్తంగా 336,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులతో, అదేవిధంగా జర్మన్ సమ్మేళనం సిమెన్స్ ప్రపంచవ్యాప్తంగా 190 కేంద్రాల్లో సుమారు 3,16,000 మంది ఉద్యోగులతో, యూఎస్‌ కేంద్రంగా ఉన్న ప్రముఖ టెక్నాలజీ సంస్థ ఐబీఎం ( IBM ) దాదాపు 288,300 మంది ఉద్యోగులతో మరియు సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (Microsoft) ప్రపంచ వ్యాప్తంగా సుమారు 2,21,000 మంది ఉద్యోగులతో నిండి వున్నట్టు తాజా సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube