సోషల్ మీడియా వచ్చాక ప్రపంచమే ఓ కుగ్రామం అయిపోయింది.దేశంలోనే కాదు, ప్రపంచంలోని ఏమూలన వున్న విషయన్నైనా మనం ఇట్టే తెలుసుకోగలుగుతున్నాము.
అందలోను కాస్త ఆసక్తికరమైన కంటెంట్ అంటే జనాలు తెగ చూస్తున్నారు.దాంతో అనేక రకాల వీడియోలు వైరల్ కావడం మనం చూస్తూ వున్నాము.
సరిగ్గా ఈ తరుణంలో ఏఐ (ఆర్టిఫిసియల్ ఇంటిలిజెన్స్) ఇంటర్నెట్ ప్రపంచంలోకి అడుగుపెట్టి ఒక్కసారిగా ఇంటర్నెట్ ప్రపంచ గతిని మార్చివేసింది.దీని సాయంతో ఇపుడు నిపుణులు వారి వారి పనులను మరింత త్వరగా పూర్తి చేసుకుంటున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ ( Prime Minister Narendra Modi )తెలుగులో పాట పడితే ఎలా ఉంటుంది? అని AIలో ట్రై చేశారు.కట్ చేస్తే దేశ ప్రధాని కాస్త రాక్ స్టార్ అయిపోయారు.

అవును, ఇపుడు మోడీ తెలుగు పాటలు పాడేస్తున్నట్లు కొన్ని వీడియోలు క్రియేట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు.దాంతో ఆ వీడియోలు భలే వైరల్ అవుతున్నాయి.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఇప్పుడు సాధ్యం కానిది ఏదీ లేదని ఈ వీడియోలే నిరూపిస్తున్నాయి.AI తో నెటిజన్లు అద్భుతాలు క్రియేట్ చేసి చూపుతున్నారు.ఈ క్రమంలో గ్లోబల్ లీడర్లు రాక్ స్టార్లుగా మారిపోతున్నారు.సంగీత కచేరీలు కూడా చేసేస్తున్నారు మరి.ఇపుడు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ వంతు వచ్చింది.అదేవిధంగా మరికొంతమంది అమెరికా అధ్యక్షుడు జో బిడెన్( US President Joe Biden ), రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కి సంబందించిన వీడియోలు చేయడంతో వీరంతా ఇప్పుడు AI తో రాక్ స్టార్లుగా మారిపోయారు.
ముఖ్యంగా ఇటలీ ప్రధాని జార్జియా మెలోనిని మోడీ కలిసిన వీడియోకు తెలుగు సినిమా పాటలు జత చేసి పోస్టు చేస్తుండడంతో ఆ వీడియో కాస్త తెగ వైరల్ అవుతోంది.నిజంగా నరేంద్ర మోడీ వాయిస్సా.
అన్నట్లు సింగర్ పాడటం కూడా ఇక్కడ విశేషంగా చెప్పుకోవచ్చు.







