జరుగు తున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తుంది .నిజానికి తెలంగాణలో ఒకప్పుడు అత్యంత కీలకమైన పార్టీగా పేరు గడించిన తెలుగుదేశం తెలంగాణ ఏర్పాటు తన ప్రభావాన్ని కోల్పోయింది తర్వాత ఆ పార్టీ కీలక నాయకులు అందరూ అధికార బారాస హైజాక్ చేయడంతో ఇక పూర్తిస్థాయిలో పార్టీ కాళీ అయిపోయింది.
అయినప్పటికీ ఒకప్పుడు జెండాలు మోసిన కార్యకర్తల అభిమానం అంతో ఇంతో మిగిలే ఉంది.అయితే అది కనీసం పోటీ ఇచ్చే స్థాయిలో కూడా లేకపోవడంతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు( Chandrababu ) తన రెండు కళ్ళ సిద్ధాంతాన్ని పక్కనపెట్టి ఒక కన్ను అయిన ఆంధ్ర ప్రదేశ్ తో సర్దుకుపోయారు.
ఇప్పుడు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్( Andhra Pradesh ) అధికార పార్టీ ఇస్తున్న వరుస షాకులతో రెండో కన్ను కూడా మసకబారింది.

ఇలాంటి సమయంలో ఆంధ్రా లో పార్టీ పరిస్థితులు చక్కదిద్దుకోవటం మానేసి బాలయ్య తెలంగాణ టిడిపికి( TDP ) తిరిగి పునర్ వైభవం తీసుకొస్తానంటూ భీషన ప్రతిజ్ఞలు చేస్తున్నారు.దీని వెనక కారణం ఏమిటో ఎవరికీ అంతుపట్టడం లేదు.అయితే చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఏర్పడిన నాయకత్వ కొరత ను తీర్చడానికి బాలయ్య ముందుకు రావడంతో ఆయన దూకుడుతో పార్టీకి మరింత నష్టం కలుగుతుందన్న ముందు చూపుతోనే ఆయనను తెలంగాణ పార్టీకి డైవర్ట్ చేశారని అక్కడ పార్టీకి పునర్ వైభవం రావడం అసాద్యం అని తెలిసినా కేవలం బాలయ్య ఉత్సాహం డైవర్ట్ చేయడానికి మాత్రమే తెలంగాణ టీడీపీ బాధ్యతలు బాలయ్య అప్పచెప్పినట్లుగా ప్రచారం జరుగుతుంది.
దాంతో తనకు దక్కిన కొత్త పదవిపై బాలయ్య ఫుల్ ఫోకస్ పెట్టారని పొత్తులు ఎత్తులు అంటూ కొత్త పల్లవి అందుకున్నట్లుగా తెలుస్తుంది.అయితే ఎంత ప్రయత్నించినా అసలు ప్రాణమే లేని గుర్రం పరిగెట్టలేదన్నట్లుగా నోటాతో పోటీ పడే స్థాయిలో బలహీనమైపోయిన పార్టీ తిరిగి పుంజు కోవడం అన్నది అసాధ్యంగా కనిపిస్తుంది.
అయితే రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చని గుర్రం ఎగురుతుంది అన్న ఆశతో బాలయ్య ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కనిపిస్తుంది.







