చిరంజీవితో సినిమా చేయడం ఈజీ కాదు.. బోయపాటి శ్రీను షాకింగ్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్లలో బోయపాటి శ్రీను( Boyapati Sreenu ) ఒకరు కాగా ఈ దర్శకునికి ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు.అఖండ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్న బోయపాటి శ్రీను స్కంద సినిమాతో ( Skanda Movie ) యావరేజ్ హిట్ ను సొంతం చేసుకున్నారు.

 Boyapati Sreenu Shocking Comments On Chiranjeevi Goes Viral In Social Media Deta-TeluguStop.com

ఇప్పటికే పలువురు మెగా హీరోలతో సినిమాలు చేసిన బోయపాటి శ్రీను చిరంజీవితో కూడా సినిమా చేస్తే బాగుంటుందని అభిమానులు ఫీలవుతున్నారు.

చిరంజీవి గారితో సినిమా చేయాలంటే ఆయనకు సూట్ అయ్యే కథ ఉండాలని బోయపాటి శ్రీను అన్నారు.

గతంలో చిరంజీవి గారితో( Chiranjeevi ) సినిమా చేయడం దిశగా అడుగులు పడలేదని ఆయన చెప్పుకొచ్చారు.అఖండ తర్వాత అన్నీ మారిపోయాయని బోయపాటి శ్రీను తెలిపారు.చిరంజీవితో సినిమా చేయాలంటే అఖండలా కొత్త తరహా కథను ఎంచుకోవాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.అఖండకు ముందు తయారు చేసిన కథలు ఇప్పుడు పనికిరావని బోయపాటి శ్రీను తెలిపారు.

ప్రస్తుతం సినిమాలు చేయాలంటే అఖండ ( Akhanda ) తరహా స్పాన్ ఉన్న సినిమా అని ఆయన పేర్కొన్నారు.ఈరోజు పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు పాలిటిక్స్ గురించి అవగాహన ఉందని ఆ ఫ్రస్టేషన్ ను స్కంద సినిమాలో ఈ విధంగా చూపించామని బోయపాటి శ్రీను కామెంట్లు చేశారు. కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించి త్వరలో పూర్తిస్థాయిలో క్లారిటీ రానుంది.బోయపాటి సినిమాలన్నీ 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి.

ఈ సినిమాల కమర్షియల్ లెక్కలు ఏ విధంగా ఉంటాయో చూడాల్సి ఉంది.కొన్ని విషయాలలో మారితే బోయపాటి శ్రీను మరిన్ని సంచలనాలు సృష్టించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను భవిష్యత్తు ప్రాజెక్ట్ లు సంచలనాలు సృష్టించి లాభాలను అందించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube