టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందిన తర్వాత పెద్ద ఎత్తున సైబర్ నేరగాళ్లు( Cyber Crimes ) కూడా మోసాలకు పాల్పడుతున్న సంగతి మనకు తెలిసిందే.బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నాము అంటూ మనకు తెలియకుండానే మన బ్యాంకు వివరాలను నీటిని కూడా తీసుకొని మన ఖజానా ఖాళీ చేస్తున్నారు.
ఇలా సైబర్ నేరగాళ్ల చేతిలో చదువుకోని వారు మాత్రమే కాకుండా చదువుకొని మంచి మంచి ఉద్యోగాలు చేసేవారు కూడా భారీ స్థాయిలో నష్టపోతున్న సంగతి మనకు తెలిసిందే.అయితే సైబర్ నేరగాళ్ల మోసాలకు సినిమా సెలబ్రిటీలకు కూడా బలైనటువంటి సందర్భాలు ఉన్నాయి.
ఈ క్రమంలోనే తాజాగా నటుడు బ్రహ్మాజీ (Brahmaji) సైబర్ నేరగాళ్లు చేసే మోసం తరహాలోనే సినిమా ఇండస్ట్రీలో కూడా సరికొత్త మోసానికి తెర లేపుతున్నారు అంటూ ఈయన అందరిని అలర్ట్ చేశారు.కొంతమంది ఫోన్లు చేసి ఫలానా డైరెక్టర్ మేనేజర్ అంటూ ఫోన్లు చేసి భారీగా డబ్బు లూటీ చేస్తున్నారని ఈయన సినిమా సెలబ్రిటీలను జాగ్రత్తగా ఉండాలి అంటూ హెచ్చరించారు.ఈ క్రమంలోనే ట్విట్టర్ వేదికగా బ్రహ్మజీ స్పందిస్తూ.అందరికీ హెచ్చరిక ఈ నెంబర్ 7826863455 లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) మేనేజర్ ఫోన్ నెంబర్ లాగా ఉంటుంది.
అతని పేరు కనగరాజ్ అన్నాదురై.ఫోన్ చేసి నేను లోకేష్ మేనేజర్ ని ఆయన తదుపరి సినిమా కోసం మీ ప్రొఫైల్ ను ఎంపిక చేశారు.
ఈ సినిమా కోసం కాస్ట్యూమ్స్ అవసరమవుతాయి ఆడిషన్స్ కాస్ట్యూమ్స్ కోసం మీరు డబ్బులు చెల్లించండి అడిషన్( Audition ) పూర్తి అయిన తర్వాత మీ డబ్బులు మీకు చెల్లిస్తాం అంటూ ఫోన్ చేస్తారు.ప్రస్తుతం చలనచిత్ర పరిశ్రమలో జరుగుతున్నటువంటి సరికొత్త మోసం జాగ్రత్తగా ఉండండి అంటూ ఈయన హెచ్చరించారు.సత్యానంద్ 90877 87999 ఫోన్ నెంబర్ నుంచి కూడా ఫోన్ కాల్స్ వస్తుంటాయి అయితే ఎవరికైతే సినిమాలలోకి రావాలని ఆసక్తి ఉంటుందో అలాంటి వారిని టార్గెట్ చేస్తూ తాను ప్రముఖ జర్నలిస్టుగా చెప్పుకుంటూ వారి నుంచి భారీగా డబ్బులు లాగుతున్నారని ఇలాంటి వారి పట్ల బి కేర్ ఫుల్ అంటూ ఈ సందర్భంగా బ్రహ్మాజీ సోషల్ మీడియా వేదికగా అందరిని హెచ్చరిస్తూ చేసినటువంటి ఈ పోస్ట్ వైరల్ గా మారింది.