సిద్దిపేటలో వెయ్యి పడకల ప్రభుత్వ ఆస్పత్రిని మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు.పదేళ్లలో వంద పడకల ఆస్పత్రి వెయ్యి పడకల ఆస్పత్రిగా మారిందని తెలిపారు.
హైదరాబాద్ లోని గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో ఉన్న సేవలు సిద్ధిపేటలోనూ అందుబాటులోకి వచ్చాయని మంత్రి హరీశ్ రావు వెల్లడించారు.ఐదో అంతస్తులో 15 ఆపరేషన్ థియేటర్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.అదేవిధంగా వంద ఐసీయూ బెడ్స్ అందుబాటులో ఉన్నాయన్నారు.30 పడకల ఎమర్జెన్సీ విభాగాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు మంత్రి హరీశ్ రావు వెల్లడించారు.ఇకపై వైద్య సేవల కోసం హైదరాబాద్ కు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు.ఈ క్రమంలోనే వైద్య వ్యవస్థలో తెలంగాణలోని బీఆర్ఎస్ ప్రభుత్వం విప్లవం సృష్టించిందని తెలిపారు.







