సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్( Victory Venkatesh ) ప్రస్తుతం తన కెరీర్ లోనే మైల్ స్టోన్ మూవీ అయిన 75వ ప్రాజెక్ట్ ను చేస్తున్నాడు.ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఎప్పుడు లేనంత అంచనాలు ఉన్నాయి.అందుకు కారణం డైరెక్టర్ అని కూడా చెప్పాలి.హిట్ సినిమాతో టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్న డైరెక్టర్ శైలేష్ కొలను గురించి అందరికి తెలుసు.

మరి ఈ యంగ్ డైరెక్టర్ తోనే ఇప్పుడు వెంకీ తన సినిమా చేస్తున్నాడు.శైలేష్ కొలను దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుండగా ”సైంధవ్”( Saindhav ) అనే టైటిల్ ను ఖరారు చేసారు.ఇప్పటికే శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా నుండి తాజాగా అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.ఈ సినిమా డిసెంబర్ లో రిలీజ్ చేయాలని మేకర్స్ ముందుగా ప్లాన్ చేసుకున్నారు…
అనుకున్నట్టుగానే షూట్ కూడా ఫాస్ట్ గా పూర్తి చేస్తున్న నేపథ్యంలో ఈ సినిమా వాయిదా పడుతుంది అని గత కొద్దీ రోజులుగా నెట్టింట పలు వార్తలు వైరల్ అవుతున్నాయి.
మరి ఈ సినిమా రూమర్స్ వచ్చిన విధంగానే సంక్రాంతికి షిఫ్ట్ అయినట్టు తెలుస్తుంది.ఈ మేకర్స్ మేకర్స్ తాజాగా అఫిషియల్ అప్డేట్ అయితే ఇచ్చి ఈ సస్పెన్స్ కు తెర తీశారు…

ఈ సినిమా కూడా పొంగల్ రేస్ లోనే రాబోతుంది.ఈ ఏడాది సంక్రాంతి బరిలో జనవరి 13న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు.దీంతో ఇప్పుడు పొంగల్ రేస్ మరింత హీట్ గా మారింది.
చూడాలి లాస్ట్ వరకు ఏఏ సినిమాలు బరిలో ఉంటాయో.ఇక వెంకటేష్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను నిహారిక ఎంటర్టైన్మెంట్స్ వారు భారీ స్థాయిలో నిర్మిస్తుండగా.
సంతోష్ నారాయణ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.కాగా ఈ సినిమాలో వెంకీకి జోడీగా శ్రద్ధ శ్రీనాథ్( Shraddha Srinath ) నటిస్తుండగా.
ఆండ్రియా, రుహనీ శర్మ కూడా కీ రోల్స్ పోషిస్తున్నారు.







