మాములుగా ఇండస్ట్రీలో చిన్న సినిమాలను పెద్ద పెద్ద హీరోలు ప్రోత్సహించడం ప్రమోట్ చేయడం లాంటివి కామన్.అలా ఈ మధ్యకాలంలో కూడా మహేష్ బాబు చిన్న చిన్న సినిమాలను ప్రమోట్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం.
చిన్న సినిమాల టీజర్లు విడుదల చేయడం అందుకు సంబంధించి సోషల్ మీడియాలో ట్వీట్లు చేయడం చూస్తూనే ఉన్నాం.అయితే అభిమానులు అన్నిసార్లు కూడా దీనిని రిసీవ్ చేసుకోలేరు అన్న విషయం తెలిసిందే.
అదే విషయం గురించి డిస్కషన్లు పెట్టి చర్చించుకుంటూ ఉంటారు.ఇక తాజాగా మహేష్ బాబు( Mahesh babu ) చేసిన ట్వీట్ గురించి ఇప్పుడు అభిమానులు చర్చించుకుంటున్నారు.
ఇంతకీ మహేష్ ఏం చేశాడంటే.ఎల్లుండి విడుదల కాబోతున్న మ్యాడ్ ట్రైలర్ ని మహేష్ బాబు షేర్ చేసి శుభాకాంక్షలు చెబుతూ ఎప్పుడెప్పుడు చూడాలని ఉందా అని ట్వీట్ చేసాడు.

అయితే మహేష్ అలా ( Mahesh babu )ట్వీట్ చేయడం వెనుక కారణం కూడా లేకపోలేదు.మ్యాడ్ కోసం నిర్మాతగా మారిన సోదరి కోసం సమర్పకుడిగా వ్యవహరిస్తున్న నాగవంశీ కోసమే మహేష్ సపోర్ట్ ఇచ్చాడు.కానీ ఈ విషయం స్పందిస్తున్న మహేష్ అభిమానులు ఆ సినిమా విడుదల అయ్యి హిట్ టాక్ని తెచ్చుకున్న తర్వాత ఆ ఆనందాన్ని పంచుకొని ఉండుంటే ఇంకా బాగుండేది అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.ఆ మధ్య మేం ఫేమస్ మూవీకి కూడా మహేష్ ఇలాగే సపోర్ట్ చేస్తే దానిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరిగింది.
తనతో మేజర్ లో నిర్మాణ భాగస్వాములుగా ఉన్నందుకు చాయ్ బిస్కెట్ బృందం రిక్వెస్ట్ మీద మహేష్ ఒక రెండు ముక్కలు దాని గురించి ఎక్కువే చెప్పాడు.ఇక కట్ చేస్తే బొమ్మ ఆశించిన స్థాయిలో ఆడలేదు.
సక్సెస్ మీట్లు, ఫ్రీ షోలు, మీట్ ది ప్రెస్ లు ఎన్ని పెట్టినా బ్లాక్ బస్టర్ కాలేకపోయింది.

ఆ తర్వాత అనిల్ సుంకర( Anil Sunkara ) నిర్మాతనే ఉద్దేశంతో భోళా శంకర్( Bholaa Shankar ) కు సైతం మహేష్ విషెస్ చెప్పాడు.దాని ప్రతికూల ఫలితం ఊహించిందే కాబట్టి పెద్దగా హైలైట్ అవ్వలేదు.అయితే మహేష్ బాబు కేవలం మొహమాటం వల్లే మహేష్ ఇలా రిలీజ్ కాని సినిమాలకు ట్వీట్ చేస్తున్నాడని అభిమానుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది.
అసలే మ్యాడ్ లో యూత్ ఫుల్ జోకులతో పాటు కాసిన్ని డబుల్ మీనింగులు కూడా ఉన్నాయని టీజర్ లోనే హింట్ ఇచ్చారు.ఒకవేళ బ్లాక్ బస్టర్ అయితే ఇబ్బంది లేదు కానీ తిరిగి ఏదైనా కొంచెం తేడా కొట్టిందంటే కొంచెం ఇబ్బంది తప్పదు.
మొత్తానికి ఈ విషయం పట్ల మహేష్ అభిమానులు తలలు పట్టుకుంటున్నారు.







