టాలీవుడ్ ప్రముఖ ఎడిటర్లలో మార్తాండ్ కె వెంకటేశ్( Marthand K Venkatesh ) ఒకరు కాగా ఈ ఎడిటర్ కు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ఎన్నో హిట్ సినిమాలకు మార్తాండ్ కే వెంకటేశ్ ఎడిటర్ గా పని చేశారు.
జయంత్ సి పరాన్జీ డైరెక్షన్ లో తెరకెక్కిన బాలయ్య సినిమాలకు మాత్రమే నేను ఎడిటర్ గా చేశానని ఆయన అన్నారు.బాలయ్య గారి సినిమాలు అన్నీ వేరే వాళ్లు చేసేవారని మార్తాండ్ కె వెంకటేశ్ పేర్కొన్నారు.

హీరోలు ఎడిటర్లను రికమెండ్ చేశారని ఆయన కామెంట్లు చేశారు.సీజీ వర్క్ విషయంలో నేను జోక్యం చేసుకోనని ఆయన చెప్పుకొచ్చారు.మెహర్ రమేష్( Meher Ramesh ) గారి అన్ని సినిమాలకు నేను పని చేశానని మార్తాండ్ కె వెంకటేశ్ అన్నారు.భోళా శంకర్ సినిమా( Bhola Shankar movie ) అంత పెద్ద ఫ్లాప్ కావడానికి కారణం నాకు అర్థం కాలేదని ఆయన కామెంట్లు చేశారు.
భోళా శంకర్ అబవ్ యావరేజ్ మూవీ అనుకున్నానని ఆయన చెప్పుకొచ్చారు.

భోళా శంకర్ డిజాస్టర్ అవుతుందని భావించలేదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.చిరంజీవి గారితో ఈ మాట కూడా నేను అన్నానని మార్తాండ్ కే వెంకటేశ్ కామెంట్లు చేశారు.మెహర్ రమేష్ ను ఎందుకు ట్రోల్ చేస్తారో అర్థం కాలేదని ఆయన పేర్కొన్నారు.
సినిమా చూడకుండానే భోళా శంకర్ మూవీపై నెగిటివ్ కామెంట్లు చేశారని మార్తాండ్ కే వెంకటేశ్ వెల్లడించారు.లీడర్ సినిమా విషయంలో నా అంచనా తప్పిందని ఆయన అన్నారు.
ఆరెంజ్ మూవీ కూడా బాగా నచ్చిందని క్లైమాక్స్ తప్ప ఆ సినిమా నచ్చిందని అయితే ఆ సినిమా ఎందుకు ఫ్లాపైందో అర్థం కాలేదని మార్తాండ్ కె వెంకటేశ్ అన్నారు.అనామిక సినిమా రిజల్ట్ ను ముందే ఊహించనని ఆయన కామెంట్లు చేశారు.
ఫిదా మూవీ విషయంలో నా అంచనా నిజమైందని మార్తాండ్ కె వెంకటేశ్ అన్నారు.







