పవర్ స్టార్ పవన్ కళ్యాన్( Pawan Kalyan ) హీరోగా ప్రస్తుతం మూడు సినిమా లు షూటింగ్ దశలో ఉన్నాయి.అందులో చాలా రోజుల క్రితం మొదలు అయిన క్రిష్ మూవీ హరి హర వీరమల్లు ను ఎప్పుడు పూర్తి చేస్తారో క్లారిటీ లేదు.
క్రిష్ ఆ సినిమా ని రెండు భాగాలుగా విడుదల చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాడు.అందుకు గాను పవన్ నుంచి కాస్త ఎక్కువ డేట్ల ను కోరడం జరిగిందట.
ఇక ఓజీ సినిమా( OG Movie ) ను కేవలం 40 రోజుల్లో ముగించి ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాను అన్నట్లుగా సాహో సుజీత్ అన్నాడు.కానీ ఇప్పటి వరకు ఆ సినిమా షూటింగ్ ని ముగించే పని చేయడం లేదు.

ఇటీవల ఉస్తాద్ భగత్ సింగ్( Ustaad Bhagath Singh ) షూటింగ్ లో పవన్ కళ్యాణ్ పాల్గొన్న విషయం తెల్సిందే.ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమా లు జోరుగా సాగుతున్నాయి అనుకున్న సమయం లో చంద్రబాబు నాయుడు అరెస్ట్( Chandrababu Arrest ). ఆ వెంటనే రాజమండ్రి వెళ్లి బాబు ను పవన్ పలకరించడం వంటివి జరిగాయి.దాంతో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ అనుకున్న షెడ్యూల్ ముగించలేదు.
పైగా ఈ ఏడాది లో ఓజీ లేదా ఉస్తాద్ భగత్ సింగ్ ని విడుదల చేయాలని భావించినా కూడా సాధ్యం కావడం లేదు.ఎన్నికల హడావుడి మొదలు అయింది.
వారాహి యాత్ర( Varahi Yatra ) లో భాగంగా పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా మరింత జోరు గా ప్రచారం చేయాలని యాత్ర నిర్వహించాలని నిర్ణయించుకున్నాడు.

అందుకే ఇప్పట్లో మళ్లీ కెమెరా ముందుకు వచ్చే అవకాశాలు లేవు అంటున్నారు.అందుకే దర్శకుడు హరీష్ శంకర్( Director Harish Shankar ) ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ని ముగించాలనే ప్రయత్నాన్ని పక్కన పెట్టి మరేదైనా సినిమా ని మొదలు పెట్టాలని అభిమానులు మరియు పవన్ కళ్యాణ్ సన్నిహితులు చెప్పినట్లుగా తెలుస్తోంది.కానీ హరీష్ శంకర్ మాత్రం ఆ విషయం లో ఆసక్తి కనబర్చడం లేదు.
పవన్ మూవీ ముగించాలనే ఉద్దేశ్యం తో ఉన్నాడు.సాహో సుజీత్ కూడా ఓజీ వచ్చిన తర్వాతే మరేదైనా అంటున్నాడు.







