మనిషి యావత్ జీవితంలో చూసుకుంటే వివాహం( marriage ) అనేది ఓ ముఖ్యమైన ఘట్టంగా మిగిలిపోతుంది.వివాహం లేకుంటే ఈ సృస్టి లేదని చెప్పుకోవచ్చు.
అదేవిధంగా మగాడు లేని ఆడదానికి, ఆడదిలేని మగాడికి ఈ సమాజంలో విలువ వుండనే వుండదు.అదే తాడు లేని బొంగరానికి విలువ లేదన్నట్టు.
అందుకే మన పూర్వికులు పేళ్ళి అనే దారంతో ఇద్దరు యువతీయువకులకు బంధాన్ని ముడిపెట్టారు.ఈ బంధం భాధ్యతని స్వీకరించేలా చేస్తుంది.
ఆ భాద్యత మనిషిని సన్మార్గంలో నడిపిస్తుంది.తద్వారా ఈ సృష్టి మనుగడకు కారణభూతంగా నిలుస్తుంది.
అందుకే పెళ్ళికి మనిషి జీవితంలో ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు.కానీ.ప్రస్తుతం కాలంలో యువత మాత్రం పెళ్లికి దూరంగా ఒంటరిగా బతకాలని ఆశపడుతున్నారు.అయితే ఇది ఒక్క మనదేశానికే కాదు యావత్ ప్రపంచంలో యువత తీరు ఇలానే ఉందని సర్వేలు చెబుతున్నాయి.
ఇలా పెళ్ళికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారు అని యువతను అడిగితే రకరకాల విచిత్రమైన కారణాలు చెబుతున్న పరిస్థితి.కొందరు యువత కెరీర్ కి ప్రాధాన్యత ఇస్తున్న విషయంలో వైవాహిక జీవితానికి సమయం కేటాయించలేము అని చెప్తున్నారు.
ఇక మరికొందరు అయితే విచిత్రంగా విడాకులు( Divorce ) తీసుకున్న జంటలను చూసి పెళ్లి అంటేనే భయపడుతున్నామని చెబుతున్నారు.మరికొందరు పెళ్ళైతే స్వేచ్ఛ స్వాతంత్రం పోతుందని, జీవితంలో కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుందని.చెబుతున్నారు.అయితే ఈ కారణాలు విని చాలామంది పెద్దవాళ్ళు విస్తుపోతున్నారు.నేటి యువత( Youth ) బాగా జల్సాలకు అవలవాటు పడిందని, ఒంటరిగా వుంటే వారి జీవితం చాలా సుఖంగా వుంటుందని అనుకుంటూ నూరేళ్ళ జీవితాన్ని పాడుచేసుకుంటున్నారని అభిప్రాయపడున్నారు.జీవితంలో కేరీర్ ఎంత ముఖ్యమో పెళ్లి, పిల్లలు అనే బాధ్యత కూడా అంతే ముఖ్యం అని అంటున్నారు.