సెలబ్రిటీ కబుల్స్ లో ఒకరైన సూర్య జ్యోతిక ( Suriya-Jyothika ) ఎంతో అన్యోన్యంగా ఇప్పటికీ చాలా ప్రేమతో ఉంటారు.వీరిద్దరిని చూసి చాలామంది నేర్చుకోవచ్చు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
ఇక పెళ్లయినా కూడా సూర్య జ్యోతికకు ఎలాంటి ఆంక్షలు కూడా పెట్టరు.అంతే కాదు తన ఇష్ట ప్రకారమే మళ్ళీ సినిమాల్లో నటించడానికి ఒప్పుకున్నారు.
అయితే సూర్య ( Suriya ) జ్యోతికల పెళ్లయ్యాక సూర్యని జ్యోతికకు విడాకులు ఇచ్చి వేరే పెళ్లి చేసుకోమని ఓ వ్యక్తి చెప్పారట .మరి ఆయన ఎవరు ఎందుకు అలా చెప్పారు అనేది తెలుసుకుందాం.సూర్య జ్యోతిక కలిసి సినిమాల చేస్తున్న సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది.
ఇక ఈ ప్రేమ విషయాన్ని ధైర్యంగా జ్యోతిక తమ ఫ్యామిలీకి చెప్పినప్పటికీ సూర్య మాత్రం తండ్రి మీద ఉన్న భయంతో జ్యోతికని ప్రేమిస్తున్న విషయాన్ని దాచి పెట్టారు.
ఇక కొన్ని సంవత్సరాలు అలా గడుస్తున్న సమయంలో సూర్యకి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారట ఆయన తండ్రి శివకుమార్( Siva kumar ) .ఇక తండ్రి అనుకుంటే నిజంగానే చేసే తీరుతారు అనే భయంతో ఏం చేయాలో తెలియక జ్యోతిక దగ్గరికి వెళ్లి అసలు విషయం చెప్పి తన స్నేహితుడు సహాయంతో రహస్యంగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని పెళ్లి బంధంతో సూర్య జ్యోతిక ఒకటయ్యారట.

ఆ తర్వాత పెళ్లి ఇప్పుడే వద్దు సినిమాల్లో ఇంకొన్ని రోజులు రాణించాక చేసుకుంటాను అని అబద్ధం చెప్పారట సూర్య(Suriya) .ఇక ఆ తర్వాత కాలంలో సూర్య జ్యోతిక పెళ్లి చేసుకునే విషయం శివకుమార్ కి తెలిసి సూర్యని పిలిపించి నాకు తెలియకుండా ఇలాంటి పని చేస్తావా అని గట్టిగా అడిగారట.దాంతో భయపడి పోయిన సూర్య మీకు భయపడే ఈ విషయాన్ని బయట పెట్టలేదు అని చెప్పారట.

అయినప్పటికీ జ్యోతిక ( Jyothika ) ముస్లిం కావడంతో అలాగే హీరోయిన్ కావడంతో నేను ఈ పెళ్లికి ఒప్పుకోను.ఆమెకు విడాకులు ఇచ్చి వేరే పెళ్లి చేసుకో అని చెప్పారట.కానీ అప్పటివరకు తండ్రి అంటే భయపడే సూర్య ఒక్కసారిగా తండ్రిని ఎదిరించి నేను ఆల్రెడీ జ్యోతికను పెళ్లి చేసుకున్నాను .ఇష్టముంటే అంగీకరించండి నేను మాత్రం జ్యోతికను వదిలి పెట్టేది లేదు అని గట్టిగా చెప్పేసారట.దాంతో శివకుమార్ కూడా చేసేదేమీ లేక మళ్లీ గ్రాండ్ గా పెళ్లి చేశారంట.
కానీ పెళ్లికి ముందు సినిమాల్లో చేయకూడదు అని షరతు పెట్టారట.ఇక దీనికి ఒప్పుకున్న జ్యోతిక సూర్య మళ్లీ బంధుమిత్రుల సమక్షంలో ఒక్కటయ్యారు.
ఇక పెళ్లయ్యాక పిల్లల పుట్టాక చాలా సంవత్సరాలు ఇంటి పట్టునే ఉన్న జ్యోతిక మళ్లీ భర్త సహకారంతో సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది.







