సీనియర్ ఎన్టీఆర్ పెట్టిన తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party ) కోసం జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) 2009 లో తన ప్రాణాలను పణంగా పెట్టి పోరాడాడని ఫలితాలు అనుకూలం గా రాకపోయినా జూనియర్ శ్రమను తక్కువ చేయలేమని అలాంటి వ్యక్తి వ్యక్తికి 2014 లో తగిన గుర్తింపు ఇవ్వకపోవడం వల్లే జూనియర్ పార్టీకి దూరమయ్యారని దాని ఫలితాన్ని ఇప్పుడు తెలుగుదేశం అనుభవిస్తుంది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ( Tammareddy Bharadwaja ).సమాన ఇమేజ్ ఫ్యాన్ బేస్ ఉన్న పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) జూనియర్లలో ఒకరికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ఒకరిని పూర్తిగా పక్కన పెట్టడం వల్లే టీడీపీకి ఇప్పుడు నాయకత్వ కొరత ఏర్పడిందని పవన్ కళ్యాణ్ ఎంత మద్దతు ఇచ్చినా ఆయన పొరుగు పార్టీ ప్రెసిడెంట్ అవుతారు తప్ప తెలుగుదేశం మనిషి అవరని అలాంటప్పుడు సొంతం మనిషి అయిన జూనియర్ ను దూరం చేసుకోవడం అంత తెలివైన నిర్ణయం కాదన్నది ఆయన వాదన .

అంతేకాకుండా పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చినప్పటికీ జనసైనికులు ఎంతవరకు టిడిపికి మద్దతుగా నిలుస్తారో చెప్పలేమని పవన్ సొంతంగా పోటీ చేసి ఓట్లు అభ్యర్థించిన ఆయనకు 2019 లో అనుకూలత రాలేదని మరి తమ కూటమికి వోట్లు వేయమని పవన్ ఇచ్చిన పిలుపు ఏ మాత్రం వర్కౌట్ అవుతుందో కూడా చూడాలన్నట్లుగా ఆయన నర్మగర్భం గా వ్యాఖ్యలు చేశారు .తెలుగుదేశం జనసేన పార్టీల మధ్య ఓట్ షేరింగ్ అంత సులువైన విషయం కాదని రెండు పార్టీలకు మద్దతు ఇస్తున్న సామాజిక వర్గాల మధ్య ఉన్న అంతరాలు పూర్తిస్థాయిలో కనుమరుగైతేనే పూర్తయింది పూర్తిస్థాయిలో ట్రాన్స్ఫర్ అవుతుందని అయితే పరిస్థితులు క్రమంగా మారుతున్నందున ఏమైనా జరగొచ్చుఅని ఆయన వాఖ్యనించారు.ఏది ఏమైనా జూనియర్ ను దూరం చేసుకోవడం వల్లే పార్టీకి ఇప్పుడు నాయకత్వ కొరత ఏర్పడింది అన్నది ఆయన వాఖ్యల వెనుక భావనగా కనిపిస్తుంది.మరి తమ్మారెడ్డి వ్యాఖ్యలపై తెలుగుదేశం ప్రతిస్పందన ఎలా ఉంటుందో చూడాలి
.






