అమృతం సేమ్ నటుడు హర్షవర్ధన్ (Harsha Vardhan) మొదటిసారి మెగా ఫోన్ పట్టి ప్రేక్షకుల ముందు రావడానికి సిద్ధంగా ఉన్నారు.ఈయన సుధీర్ బాబు (Sudheer Babu) హీరోగా తెరకెక్కిన మామ మశ్చీంద్ర (Mama Mascheendra).
సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.ఈ సినిమా అక్టోబర్ ఆరవ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా డైరెక్టర్ హర్షవర్ధన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమా గురించి పలు విషయాలను తెలియజేశారు.ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ సూపర్ స్టార్ కృష్ణ గారిని తలుచుకొని ఎమోషనల్ కామెంట్స్ చేశారు.

తాను కెరియర్ లో ఒక్కసారైనా సూపర్ స్టార్ కృష్ణ ( Superstar Krishna ) గారితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవాలి అనుకున్నాను అయితే నాకు అవకాశం ఎప్పుడూ రాలేదని తెలిపారు.మామా మశ్చీంద్రలో కృష్ణగారి కోసం స్పెషల్ సీన్ ను రాశాం.ఆయన్ని వెండితెరపై చూపించేందుకు ప్రయత్నించాం.ఇందుకు కృష్ణగారు కూడా ఒప్పుకున్నారు.షూటింగ్ జరుగుతున్న సమయంలోనే ఆయన మరణ వార్త ఎంతో బాధాకరం ఇలా ఈ సినిమాలో ఆయన కోసం ప్రత్యేకంగా ఒక పాత్రను సిద్ధం చేసినప్పటికీ నటించడానికి ఆయన లేకపోవడం ఎప్పటికీ ఈ సినిమాకు తీరని లోటునని హర్షవర్ధన్ తెలిపారు.

ఈ సినిమాలో ఆయనతో కలిసి పనిచేసే అదృష్ణం లేకపోయింది.అదొక్కటే అసంతృప్తి.మిగిలిన అంశాలన్నీ అలరిస్తాయని ఈ సందర్భంగా డైరెక్టర్ హర్షవర్ధన్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇక గత కొంతకాలంగా ఎలాంటి హిట్ సినిమాలు లేక ఎంతో సతమతం అవుతున్నటువంటి సుధీర్ బాబు ఈ సినిమా ద్వారా అయినా హిట్ అందుకుంటారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.ఇక ఈ సినిమాలో హీరోయిన్స్ గా యంగ్ బ్యూటీ ఈషా రెబ్బా, మృణాలిని రవి నటిస్తున్నారు.







