టాలీవుడ్( Tollywood ) ఇండస్ట్రీకి చెందినటువంటి హీరోలు అందరూ ఒక్కొక్కరుగా పెళ్లి పీటలు ఎక్కుతూ కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు ఇప్పటికే ఎంతోమంది హీరోలు పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు.తాజాగా శర్వానంద్ పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే.
త్వరలోనే వరుణ్ తేజ్ కూడా పెళ్లి చేసుకోబోతున్నారు.అలాగే దగ్గుబాటి ఇంట కూడా పెళ్లి భాజలు మోగనున్నాయి అంటూ గత కొద్ది రోజుల క్రితం పెద్ద ఎత్తున వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.
దగ్గుబాటి అభిరామ్( Abhiram ) త్వరలోనే పెళ్లి( Marriage ) చేసుకోబోతున్నారని ఈయన రామానాయుడు తమ్ముడి కుమార్తే కూతురిని అంటే వరుసకు మరదలు అయ్యే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి.
ఇప్పటికే ఈ పెళ్లికి సంబంధించి పనులన్నీ కూడా జరుగుతున్నాయని త్వరలోనే ఈ వివాహం గురించి అధికారకంగా ప్రకటించబోతున్నారంటూ కూడా వార్తలు వచ్చాయి.
అయితే తాజాగా సోషల్ మీడియాలో అభిరామ్ పెళ్లి గురించి ఒక వార్త వైరల్ గా మారింది.అభిరామ్ పెళ్లి కొన్ని కారణాలవల్ల ఆగిపోయిందని తెలుస్తోంది.త్వరలోనే పెళ్లి చేసుకోవాల్సిన ఈ జంట ఇలా ఎందుకు విడిపోయారు అనే విషయానికి వస్తే.సోషల్ మీడియాలో దగ్గుబాటి అభిరామ్ గురించి ఎలాంటి వార్తలు వస్తాయో మనకు తెలిసిందే ముఖ్యంగా శ్రీ రెడ్డితో( Srireddy ) ఈయనకు ఉన్నటువంటి సంబంధం గురించి కూడా అందరికీ తెలిసిందే.

ఇలా శ్రీ రెడ్డితో అభిరామ్ ఇదివరకే రిలేషన్ లో ఉన్నారని ఆమెతో చాలా చనువుగా ఉన్నటువంటి ఫోటోలను కూడా శ్రీరెడ్డి సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో అభిరామ్ ను మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో తాను చేసుకోబోయే అమ్మాయి గురించి కూడా ట్రోల్స్ వస్తున్నాయట దీంతో తన కూతురు చాలా ఇబ్బంది పడుతుందన్న ఉద్దేశంతో సురేష్ బాబు( Suresh Babu )కి ఆయన ఫోన్ చేసి ఈ పెళ్లి జరిగే అవకాశం లేదని తేల్చి చెప్పారట.అభిరామ్ గురించి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నటువంటి తరుణంలో తనని చేసుకోబోయే అమ్మాయి స్నేహితులు తనని ఆటపట్టిస్తున్నారని తన కూతురు మానసికంగా ఇబ్బంది పడుతున్నారని తెలుస్తోంది.

ఇలా పెళ్లికి ముందే తన కుమార్తె ఇలాంటి మానసిక ఇబ్బందులను ఎదుర్కోవడం తమకు చాలా బాధగా ఉందని ఇక పెళ్లి తర్వాత తన పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే భయంగా ఉంది అంటూ వధువు తండ్రి సురేష్ బాబుతో మాట్లాడి ఈ పెళ్లి క్యాన్సిల్ చేయించుకున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.ఇలా అభిరాం వివాహం క్యాన్సిల్ అయింది అన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిరామ్ కి శ్రీ రెడ్డి ( Sri Reddy ) ఉసురు భారీగా తగిలినట్టు ఉంది అందుకే ఆయన ఏం చేయాలనుకున్న అట్టర్ ప్లాప్ అవుతున్నాయి అంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు.ఇప్పటికే అహింసా సినిమా ద్వారా హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు అయితే ఈ సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది.

ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటే పెళ్లి కూడా క్యాన్సిల్ కావడంతో శ్రీరెడ్డి ఉసురు తగిలిందని అందుకే ఈయనకు అన్ని చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు.మరి అభిరామ్ పెళ్లి గురించి వస్తున్నటువంటి వార్తలలో ఎంతవరకు నిజం ఉందో లేదో తెలియదు కానీ ఈ విషయం గురించి వెంటనే దగ్గుబాటి ఫ్యామిలీ స్పందించకపోతే ఈ వార్తలు మరిన్ని పరిణామాలకు దారి తీసే అవకాశాలు ఉంటాయని అభిమానులు భావిస్తున్నారు.







