జనసేన వారాహి విజయ యాత్ర( Varahi Vijaya Yatra ) ప్రస్తుతం కృష్ణా జిల్లాలో సాగుతున్న సంగతి తెలిసిందే.నాలుగో విడత యాత్ర మొదటి రోజు అవనిగడ్డలో నిర్వహించారు.
ఇదిలా ఉంటే మచిలీపట్నంలో కార్యకర్తలు నాయకులతో పవన్( Pawan kalyan ) సమావేశమై పలు కీలక సూచనలు చేయడం జరిగింది.అనంతరం మీడియాతో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
జనసేన( Janasena ) అన్ని కులాలకు చెందినదని వ్యాఖ్యానించారు.నేను కులాలను వెతుక్కుని స్నేహం చేయను.
కాపు కులంలో పుట్టిన అన్ని కులాలను గౌరవిస్తా.కానీ నన్ను కుల నాయకుడిగా ముద్రిస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా కాపులు అధిక సంఖ్యలో ఉన్నారు.కాబట్టి కాపులు పెద్దన్న పాత్ర పోషించాలి.పార్టీ పెట్టగానే అధికారంలోకి రాదు.అది ఒక ఎన్టీఆర్ కే( NTR ) సాధ్యమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.వచ్చే ఎన్నికలలో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు.వైసీపీ నీ ఓడించాలంటే సమిష్టిగా అందరూ కృషి చేయాలని పేర్కొన్నారు.
కృష్ణాజిల్లాలో సాగుతున్న వారాహి విజయ యాత్రకు భారీ ఎత్తున జనసేన కేడర్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తూ ఉంది.ఆదివారం అవనిగడ్డలో జరిగిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై మరియు సీఎం జగన్ పై చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించాయి.







