బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటుడు రణబీర్ కపూర్ (Ranbir Kapoor) ఒకరు.బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయన బ్రహ్మాస్త్రా ద్వారా టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు కూడా వచ్చారు.
ఇక ఈ సినిమా కూడా తెలుగులో మంచి ఆదరణ సంపాదించుకుంది.ఇక ఈయన నటి అలియా భట్(Alia Bhatt) ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.
ఇక ఈ దంపతులకు ఒక కుమార్తె కూడా ఉంది.ఇక రణబీర్ సినిమాల విషయానికి వస్తే ఈయన సందీప్ రెడ్డి వంగ(Sandeep Reddy Vanga) దర్శకత్వంలో యానిమల్ (Animal) సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.
ఈ సినిమా షూటింగ్ పనులన్నింటినీ పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసినటువంటి ఫస్ట్ లుక్ పోస్టర్స్ అలాగే టీజర్ పెద్ద ఎత్తున సినిమాపై అంచనాలను పెంచేస్తుంది.ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో డిసెంబర్ 1వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.ఇక ఈ సినిమాలో రణబీర్ సరసన రష్మిక మందన్న(Rashmika Mandanna) నటించబోతున్న సంగతి తెలిసిందే.
ఇక ఈ సినిమా డిసెంబర్ ఒకటవ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు.
ఇక ఈ సినిమా కోసం రణబీర్ తీసుకున్నటువంటి రెమ్యూనరేషన్ గురించి ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈయన ఈ సినిమా కోసం గత సినిమాల కంటే చాలా తక్కువగా రెమ్యూనరేషన్ తీసుకున్నారని తెలుస్తుంది.ఒకప్పుడు రణబీర్ కపూర్ తన సినిమాలకు సుమారు 70 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకునేవారు అలాంటిది యానిమల్ సినిమా కోసం ఈయన 30 నుంచి 35 కోట్ల మధ్యలో రెమ్యూనరేషన్ అందుకున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఇలా రెమ్యూనరేషన్ పెంచుకుంటూ పోతున్నటువంటి హీరోలను చూస్తున్నాము కాని ఈయన మాత్రం ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ తగ్గించుకోవడానికి కారణం ఏంటని నేటిజన్స్ షాక్ అవుతున్నారు.