తెలుగు సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ క్రిష్ తీసిన సినిమాలో మొదట్లో మంచి సక్సెస్ లని అందుకున్నప్పటికీ ఆ తర్వాత ఆయన చేస్తున్న సినిమాలు జనాల్ని పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి.ముఖ్యంగా ఎన్టీఆర్ బయోగ్రఫీ( Kathanayakudu ) గా తెరికెక్కిన కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు మాత్రం భారీ డిజాస్టర్ ని అందుకున్నాయి.

దాంతో ఆయన ఒక్కసారిగా రెండు సినిమాలతో డీలా పడిపోయాడు.ఇక దాంతో పవన్ కళ్యాణ్ తో మొదలు పెట్టిన హరిహర వీరమల్లు( Hari Hara Veera Mallu ) సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే దానిమీద ఎవ్వరికి ఒక క్లారిటీ అయితే లేదు.నిన్న మొన్న మొదలుపెట్టిన సుజీత్ సినిమాని కూడా పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కంప్లీట్ చేస్తున్నాడు కానీ క్రిష్ సినిమా స్టార్ట్ చేసి మూడు సంవత్సరాలు అయిన కూడా ఇప్పటికీ ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే దానిమీద అయితే క్లారిటీ అయితే రావడం లేదు.ఇక ఇలాగే ఉంటే క్రిష్ కెరియర్ కూడా డైలమాలో పడే అవకాశం ఉందని చాలామంది ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ ఆవేదనని వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఇలాంటి సందర్భంలోనే ఆ సినిమాని పక్కన పెట్టేసి ఇంకో సినిమా చేస్తే బాగుంటుందని సినిమా ఇండస్ట్రీలో ఉన్నవాళ్లు సైతం అతనికి సలహాలిస్తున్నట్టుగా తెలుస్తుంది.

అయితే ఇక్కడ గ్యాప్ రాకుండా సినిమాలు చేస్తేనే ప్రేక్షకులు ఎక్కువగా గుర్తుంచుకుంటారు.కానీ అలా కాకుండా సినిమాకి సినిమాకి మధ్య గ్యాప్ అనేది గా ఉండి కొన్ని ఫ్లాప్ సినిమాలు వస్తే మాత్రం ఇక్కడ ఎవరు అంతగా గుర్తుంచుకోరు.అందుకే వరుస సినిమాలు చేస్తూ మంచి విజయాలను అందుకుంటూ ఉండాలి అలాంటప్పుడు మాత్రమే ఆ డైరెక్టర్ ని జనాలు ఎక్కువగా ఆదరిస్తారు.
ఇక హరిహర వీరమల్లు పరిస్థితి ఏంటి అనేది క్వశ్చన్ మార్క్ గా మారింది.ఇక పవన్ కళ్యాణ్ కి ఆ సినిమా చేసే ఇంట్రెస్ట్ ఉందా, లేదా మొత్తానికి ఆ సినిమాని రిలీజ్ చేసే అవకాశం ఉందా లేదా అనేది కూడా క్లారిటీ రావడం లేదు…
.