కృష్ణా జిల్లా: మాజీమంత్రి పొలిట్ బ్యూరో కొల్లు రవీంద్ర కామెంట్స్…వారాహి యాత్రకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం.చంద్రబాబు అరెస్ట్ పై మొదటగా స్పందించి ప్రభుత్వం పై పోరాటం చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ అన్యాయ, అక్రమాలపై పోరాటం చేస్తున్న పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు.
వైసీపీ దుర్మార్గలపై అనేక రకాలుగా పవన్ కళ్యాణ్ పోరాటం చేస్తున్నారు.
అన్యాయంపై పోరాటం ఎవరు చేసినా తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుంది.ఈ రోజు నుండి అవనిగడ్డ, బందరు, పెడన, కైకలూరు లో జరుగు వారహి యాత్రలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొని యాత్రను విజయవంతం చేసి ఈ అవినీతి అక్రమ ప్రభుత్వం కు తగిన బుద్ది చెబుతారు.