భారతీయ కారు మార్కెట్ పెరుగుతోంది, మారుతోంది.ప్రజలు ఎక్కువగా మల్టీ పర్పస్ వెహికల్స్(MPV)ను కొనుగోలు చేస్తున్నారు.
ఈ వాహనాలు చాలా స్పేస్‌తో ఉంటాయి.అదే సైజులో లభించే ఇతర కార్ల కంటే చాలా చీప్‌గా ఉంటాయి.
ఫ్యామిలీలు వీకెండ్ ట్రిప్స్ వేయడానికి ఇవి అనువుగా ఉంటాయి.భారతదేశంలోని కారు కంపెనీలు తక్కువ ధరకే కొత్త MPVలను తయారు చేస్తున్నాయి.ఇండియాలో ప్రస్తుతం లభిస్తున్న 5 చీపెస్ట్ MPVలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
• రెనాల్ట్ ట్రైబర్:
రెనాల్ట్ ట్రైబర్( Renault Triber ) MPV చాలా సౌకర్యంగా, విశాలంగా ఉంటుంది.ఇందులో ఏడుగురు వ్యక్తులు కూర్చోవచ్చు, ఇది కుటుంబాలకు మంచి ఎంపిక.దీని ధర రూ.6.33 నుండి 8.97 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.
• మారుతి సుజుకి ఎర్టిగా:
మారుతి సుజుకి ఎర్టిగా( Maruti Suzuki Ertiga ) MPV ఇండియాలో బాగా పాపులర్ అయింది.ఎందుకంటే దీని ధర తక్కువ మైలేజ్ ఎక్కువ.దీని ధరను రూ.8.64 నుంచి 13.08 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా కంపెనీ నిర్ణయించింది ఇందులో ఏడుగురు కూర్చోవచ్చు.
• కియా కేరెన్స్:
మోడర్న్ డిజైన్, అడ్వాన్స్‌డ్ ఫీచర్లు, శక్తివంతమైన ఇంజన్‌తో MPV కావాలనుకునే వారికి కోసం కియా కేరెన్స్( Kia Carens ) బెస్ట్ ఆప్షన్ అవుతుంది.దీని ధర రూ.10.45 నుంచి 18.90 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది.
• టయోటా రూమియన్:
టయోటా రూమియన్( Toyota Rumion ) MPV ధర రూ.10.29 నుంచి 13.68 లక్షలు (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది.క్వాలిటీ వెహికల్ గా అందుబాటులోకి వచ్చిన ఇది తక్కువ మెయింటెనెన్స్‌తో చాలామందికి ఫస్ట్ ఛాయిస్ అవుతోంది.
• మారుతి సుజుకి XL6:
మారుతి సుజుకి XL6 ప్రీమియం MPV, దీని ధర రూ.11.56 నుంచి 14.82 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది.ఎక్కువ డబ్బు ఖర్చు చేయకుండా లగ్జరీ టచ్ కోరుకునే వ్యక్తులకు ఇది మంచి ఎంపిక.