సాధారణంగా మనదేశంలో కుక్కలను ఎక్కువగా పెంపుడు జంతువులుగా పెంచుకుంటూ వుంటారు.కొన్ని చోట్ల పిల్లుల్ని తమ పెంపుడు జంతువులుగా( Pet Animals ) పెంచుకోవడం కూడా మనకు కనబడుతుంది.
అదే ఫారిన్ కంట్రీలలో అయితే దీనికి భిన్నంగా వుంటుంది.కొందరు పాముల్ని పెంచుకుంటే, మరికొందరు బల్లుల్ని, ఇంకొందరు పులులు, సింహాలను పెంచుకుంటూ వుంటారు.
అయితే ఇక్కడ అర్ధం చేసుకోవలసినది ఏమిటంటే ఎంతటి క్రూర జంతువు అయినా మనిషితో మచ్చిక ఏర్పడినప్పుడు అది సాధు జంతువుగానే ప్రవర్తిస్తుంది.

ఇక అలాంటి పెంపుడు జంతువులకు సంబందించిన వీడియోలు మనకు సోషల్ మీడియాలో ఎక్కువగా తారసపడుతూ వుంటాయి.తాజాగా ఆ రకానికి చెందిన వీడియో ఒకటి సోషల్ మీడియా వేదికగా అందరినీ హడలెత్తిస్తోంది.అవును, దానికి ఓ బలమైన కారణం వుంది మరి.ఒక వ్యక్తి.మొసలిని( Crocodile ) కుక్కలా సాకడం మనం ఇందులో చూడవచ్చు.
ఆ మొసలి మెడ చుట్టూ తాడు కట్టి, దానిని బయట అలా షికారుకి తిప్పుతున్నాడు.ఇది చూసినవారంతా షాక్‌కు గురవుతున్నాడు.
కాగా ఈ దృశ్యాలను ఎవరో వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది వైరల్‌గా మారింది.

ఇక ఆ మొసలిని సాకుతున్న వ్యక్తి పేరు హెనీ.( Joie Henney ) అతను బేస్ బాల్ మ్యాచ్ చూసేందుకు వచ్చి, అతనితో పాటు మొసలిని తీసుకువచ్చాడు.దాంతో అతనికి మ్యాచ్ చూసేందుకు అనుమతి లభించలేదు పాపం.ఎందుకిస్తారు? ఆ మొసలి అతనికి పెంపుడు జంతువు కావచ్చు, కానీ జనాలకి అయితే కాదు కదా.అయితే తన మొసలి ఎంతో ప్రశాంతంగా ఉంటుందని అతను మీడియాకు తెలిపాడు.అంతేకాకుద్న తన మొసలిని ఎవరైనా ముద్దు పెట్టుకోవచ్చని, అది ఎవరిపైనా దాడి చేయదని, దాని నాలుకను పట్టుకున్నా కూడా ఏమీ చేయదని తెలిపాడు.ఈ ఉదంతానికి సంబంధించిన ఈ వీడియో పెన్సిల్వేనియాకు( Pennsylvania ) చెందినదిగా తెలుస్తోంది.







