డీజే పాటలకు మాస్ స్టెప్పులు వేస్తూ తనదైన శైలిలో డైలాగ్స్ చెప్తూ మంత్రి మల్లా రెడ్డి యువతలో జోష్ నింపే ప్రయత్నం చేశారు.యువత డ్రగ్స్, మత్తు పదార్థాలకు బానిస కాకూడదు అంటూ హితవు పలికారు.
వరల్డ్ హార్ట్ డే సందర్భంగా కూకట్‌పల్లిలో మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన 5కె వాకెతాన్ లో మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.స్టేజ్ పై, వైద్యులు, యువతతో కలిసి డ్యాన్స్ చేస్తూ వారిలో ఉత్సాహం నింపారు.
పాలమ్మిన పూలమ్మిన అంటూ తన డైలాగ్ చెప్తూ అందరినీ అలరించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆరోగ్యమే మహా భాగ్యం అని, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం వ్యాయామం, యోగా, వాకింగ్ లాంటివి చేస్తూ ఉండాలని, తాను కూడా అదే చేస్తూ 70 ఏళ్ల వయస్సులో ఇంత ఉత్సాహంగా ఉన్నానని అన్నారు.
నేటి యువతలో కొందరు చెడు అలవాట్లకు బానిసై ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారని, అటువంటి వ్యసనాలకు విడనాడి ఆరోగ్యం పై శ్రద్ద వహించాలని సూచించారు.







