ఈ మధ్య కాలంలో దేశంలో చోటు చేసుకుంటున్న కొన్ని ఘటనలు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.కొన్ని దారుణమైన ఘటనలు సిగ్గు పడేలా ఉన్నాయి.
కర్ణాటక రాష్ట్రంలోని కులాంతర వివాహం( Inter Caste Marriage ) చేసుకున్నారని మూగ చెవిటి దంపతులను గ్రామం నుంచి బహిష్కరించారు.కర్ణాటక రాష్ట్రంలోని( Karnataka ) ఎన్ దేవనహల్లిలో చోటు చేసుకున్న ఈ ఘటన సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.
ఏపీలోని ఈస్ట్ గోదావరికి చెందిన మణికంఠ( Manikatha ) అనే వ్యక్తిని ఎన్.దేవరహళికి చెందిన సావిత్రమ్మ( Savithramma ) మూడేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు.ఇద్దరూ పుట్టుకతోనే మూగ, చెవిటి వారు బెంగళూరులో వీళ్లిద్దరికీ పరిచయం ఏర్పడి ఆ పరిచయం ప్రేమగా మారింది.అయితే పెళ్లి తర్వాత మణికంఠను భార్య స్వగ్రామానికి తీసుకొనిరాగా కులాంతర వివాహానికి అంగీకరించని పెద్దలు గ్రామంలోకి ఈ జంట రావడానికి అంగీకరించలేదు.

ఆ తర్వాత ఈ జంట బెంగళూరుకు( Bangalore ) వెళ్లిపోయింది.సావిత్రమ్మ గర్భవతి కావడంతో పుట్టింటికి వచ్చి నెలరోజుల క్రితం బిడ్డకు జన్మనిచ్చారు.ఈ విషయం తెలిసిన గ్రామస్తులు కులాంతర వివాహం చేసుకున్న సావిత్రమ్మ దంపతులు గ్రామంలో ఉండకూడదని నిబంధనలు విధించడంతో పాటు వాళ్లను ఊరి నుంచి పంపించకపోతే సావిత్రమ్మ తల్లీదండ్రులను కూడా వెలివేస్తామని బెదిరించారు.

టెక్నాలజీ ఇంతలా అభివృద్ధి చెందుతున్న సమయంలో ఈ తరహా ఘటనలు చోటు చేసుకోవడం హాట్ టాపిక్ అవుతోంది.పోలీసులు, అధికారులు జోక్యం చేసుకుంటే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.మూగ, చెవిటి దంపతుల( Deaf and Mute Couple ) విషయంలో గ్రామ ప్రజలు ఇంత కఠినంగా వ్యవహరించడం ఏ మాత్రం కరెక్ట్ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
నెలరోజుల పసికందుతో ఆ జంట పడే ఇబ్బందులను అర్థం చేసుకోవాలని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.కులాంతర వివాహం చేసుకున్న వారి విషయంలో ఇంత దారుణంగా వ్యవహరించడం తగదని సామాజిక కార్యకర్తలు చెబుతున్నారు.







