Chandramukhi 2 Review: చంద్రముఖి 2 మూవీ రివ్యూ: రాఘవ లారెన్స్ మళ్లీ భయపెట్టాడుగా!

వాసు దర్శకత్వంలో రజనీకాంత్ నయనతార జ్యోతిక ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం చంద్రముఖి(Chandramukhi) ఈ సినిమా 17 సంవత్సరాల క్రితం విడుదల అయ్యి ఎంతో మంచి సక్సెస్ అయింది.ఈ సినిమాకు సీక్వెల్ చిత్రాన్ని(Chandramukhi 2) తాజాగా నిర్మించారు.

 Raghava Lawrence Kangana Ranuat Chandramukhi 2 Movie Review And Rating-TeluguStop.com

ఈ సినిమాలో రజనీకాంత్ పాత్రలో రాఘవ లారెన్స్ (Raghava Lawrence) నటించిన అలాగే జ్యోతిక పాత్రలో బాలీవుడ్ నటి కంగనా(Kangana) నటించారు.ఇక ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి ఈ సినిమా చంద్రముఖి రేంజ్ లో ప్రేక్షకులను మెప్పించింది అలాగే వారిని భయపెట్టిందా అనే విషయానికి వస్తే…

కథ:

చంద్రముఖి సినిమాకు సీక్వెల్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా చంద్రముఖి ఎక్కడైతే పూర్తి అయిందో అక్కడి నుంచే ఈ సీక్వెల్ కూడా ప్రారంభమైంది.సినిమాకు ఈ సీక్వెల్ చిత్రానికి కమెడియన్ వడివేలు( Vadivelu ) పాత్రను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని చేశారు.చంద్రముఖి సినిమాలో కేవలం చంద్రముఖి ఆత్మ జ్యోతికలోకి ప్రవేశిస్తుంది కానీ ఈ సినిమాలో మాత్రం నేరుగా చంద్రముఖి వస్తుంది.

చంద్రముఖి పగ పెంచుకున్న ఆ వెట్టై రాజా (రాఘవ లారెన్స్) ఎవరు? చంద్రముఖి ఫ్లాష్ బ్యాక్ ఏంటి? అసలు ఈ వెట్టై రాజా ఎవరు? ఈ సారైనా చంద్రముఖి ఆత్మను పూర్తిగా పంపించారా లేకపోతే ఈ సినిమాని మరొక భాగం ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తారా అన్నది అంటే సినిమా చూడాల్సి ఉంటుంది.

Telugu Chandramukhi, Vasu, Kangana Ranuth, Raghavalawrence, Rajinikanth, Vadivel

నటీనటుల నటన:

హర్రర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయినటువంటి రాఘవ లారెన్స్ ఈ సినిమాలో తన నటన విశ్వరూపం చూపించారు రజినీకాంత్( Rajinikanth ) పాత్రను చేసినందుకు తగిన న్యాయం చేశారని చెప్పాలి.ఇక చంద్రముఖి పాత్రలో కంగనా లీనమైపోయినటించారు.ఇక డైరెక్టర్ పి వాసు స్క్రీన్ ప్రజెన్స్ మార్క్ అలాగే ఉందని చెప్పాలి.

Telugu Chandramukhi, Vasu, Kangana Ranuth, Raghavalawrence, Rajinikanth, Vadivel

టెక్నికల్:

డైరెక్టర్ వాసు స్క్రీన్ ప్రజెంట్ ఎంతో అద్భుతంగా ఉంది ఇక కీరవాణి సంగీతం( Keeravani ) ఈ సినిమాకి మరో లెవెల్ లో ఉందని చెప్పాలి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో అందరిని భయంతో వనికించాయనే చెప్పాలి.ఫోటోగ్రఫీ కూడా అద్భుతంగా ఉంది.

విశ్లేషణ:

సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చంద్రముఖి 2 సినిమా ప్రేక్షకులను ఎప్పటిలాగే భయభ్రాంతులకు గురిచేసింది అయితే ఎన్నో హర్రర్ సినిమాలు వచ్చినప్పటికీ ఈ సినిమా మాత్రం ప్రత్యేకమైన ఆదరణ పొందింది అని చెప్పాలి.ఇకపోతే అక్కడక్కడ కాస్త కామెడీ సీన్స్ మామూలుగానే అనిపించాయి.

Telugu Chandramukhi, Vasu, Kangana Ranuth, Raghavalawrence, Rajinikanth, Vadivel

ప్లస్ పాయింట్స్:

రాఘవ లారెన్స్ నటన, కీరవాణి మ్యూజిక్, వడివేలు కామెడీ అద్భుతమని చెప్పాలి.

మైనస్ పాయింట్స్:

అక్కడక్కడ కాస్త బోరింగ్ సన్నివేశాలు ఉన్నాయి.సన్నివేశాలు ఇతర హర్రర్ సినిమాల మాదిరిగానే అనిపించాయి.

బాటమ్ లైన్:

ఇదివరకే చంద్రముఖి సినిమా చూసాము కనుక అదే ఫీల్ లోనే ఈ సినిమాని కూడా ఒకటికి రెండుసార్లు చూడవచ్చు.

రేటింగ్: 2.75/5

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube