సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది నటులలో బాలకృష్ణ ఒకరు ఈయన చేసిన చాలా సినిమాలు హిట్ తో పాటు ఇండస్ట్రీ హిట్ కూడా కొట్టాయి.అలాగే చాలా సినిమాలు ప్లాప్ కూడా అయ్యాయి.
నిజానికి ఈయన హీరో గా వచ్చిన ప్రతి సినిమా ఒక డిఫరెంట్ అటెంప్ట్ అనే చెప్పాలి.ఆయన కెరియర్ లో చేసిన చాలా సినిమాలు మంచి విజయాన్ని అందుకోవడం తో పాటు ఇప్పుడు కూడా ఒక డిఫరెంట్ అటెంప్ట్ గా భగవంతు కేసరి( Bhagavanth Kesari ) అనే సినిమా చేస్తున్నాడు…

అయితే అప్పట్లో ఆయన వై వి ఎస్ చౌదరి డైరెక్షన్ లో వచ్చిన ఒక్క మగాడు సినిమా( Okka Magaadu ) భారీ డిజాస్టర్ అయింది.ఇక దాంతో బాలయ్య క్రేజ్ ఒక్కసారిగా పడిపోయిందనే చెప్పాలి.ఇక అలాంటి టైం లో బోయపాటి వచ్చి బాలయ్య కెరియర్ ను మళ్ళీ గాడిలో పెట్టాడు.
నిజానికి ఈయన చేసిన చాలా సినిమాలు మంచి విజయాలను అందుకున్నప్పటికి ఆ ఒక్క మగాడు సినిమా వల్ల ఆయన అంతకు ముందు సంపాదించుకున్న క్రేజ్ కూడా మొత్తం పోయింది.

ఇక ఈ సినిమా రిలీజ్ అయిన టైంలో రవితేజ కృష్ణ సినిమా( Krishna ) కూడా రిలీజ్ అయి భారీ హిట్ అయింది ఇక అప్పటి నుంచి బాలయ్య తో సినిమా తీసే డైరెక్టర్ ఎవ్వరూ అయిన కూడా ఆయన ఒకటికి పదిసార్లు టెస్ట్ చేసి మరీ సినిమా చేస్తున్నాడు…ఇక కృష్ణ సినిమా తో భారీ హిట్ కొట్టిన రవితేజ బాలయ్య మీద విజయం సాధించాడు.ఇక ఇది ఇలా ఉంటే వీళ్లిద్దరూ బయట చాలా ఫ్రెండ్లీగా గా ఉంటారు ముఖ్యంగా అన్ స్టపబుల్ షో లోకి రవితేజ వచ్చినప్పుడు ఇద్దరు కూడా చాలా ఎనర్జిటిక్ గా కనిపిస్తూ చాలా అల్లరి చేశారు…
.







