గ్రూప్ -1 ప్రిలిమ్స్ రద్దుపై టీఎస్ హైకోర్టు డివిజన్ బెంచ్ మరోసారి విచారణ

గ్రూప్-1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ రద్దుపై హైకోర్టు డివిజన్ బెంచ్ ఇవాళ మరోసారి విచారణ జరపనుంది.ఈ మేరకు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ విచారణ చేయనుంది.

 Division Bench Of Ts High Court Will Once Again Hear The Cancellation Of Group-1-TeluguStop.com

ఈ క్రమంలోనే బయోమెట్రిక్ వివరాలను తెలంగాణ ప్రభుత్వం కోర్టుకు సమర్పించనుంది.సమయం తగినంత లేకపోవడంతోనే బయోమెట్రిక్ విధానం పెట్టలేదని పేర్కొంది.

అయితే సుమారు ఆరు లక్షల మంది ఎస్సై, కానిస్టేబుల్ పరీక్షకు బయోమెట్రిక్ పెట్టారని పిటిషనర్ న్యాయస్థానానికి తెలిపారు.రెండు లక్షల మంది రాసిన గ్రూప్ -1 ప్రిలిమ్స్ కు బయోమెట్రిక్ పెట్టకపోవడంపై టీఎస్పీఎస్సీ ఆంతర్యం ఏంటని పిటిషనర్ ప్రశ్నించారు.

ఈ క్రమంలో మరోసారి ఇరుపక్షాల వాదనలు విననున్న హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును ప్రకటించనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube