నల్లగొండ జిల్లా: మునుగోడు( Munugodu ) మండల కేంద్రంలోని నాల పర్మిషన్ లేకుండా ప్రభుత్వ భూములలో అక్రమ కట్టడాలు కడుతున్న అక్రమార్కులపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గత నాలుగు రోజుల క్రితం బీఎస్పీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో నిరసన తెలిపిన బీఎస్పీ నాయకుడు పందుల సురేష్( Suresh ) ను అక్రమార్కులు బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆయన మంగళవారం మునుగోడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
తనపై కక్ష కట్టిన అక్రమార్కుల వల్ల తనకుప్రాణహాని ఉందని,తనను బెదిరిస్తున్న అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని కోరారు.