నందమూరి బాలకృష్ణ ( Nandamuri Balakrishna ) ఇటు రాజకీయాల్లో అటు సినిమాల్లో బిజీబిజీగా గడుపుతున్నారు.ఈ మధ్యనే తెలుగుదేశం పార్టీ అధినేత బాలకృష్ణ బావ అయినటువంటి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అవ్వడంతో ఏపీ రాజకీయాలు చాలా వాడి వేడిగా సాగుతున్నాయి.
అయితే సినిమాల్లో చేస్తూనే మరోవైపు రాజకీయాల్లో కూడా బాలకృష్ణ రాణిస్తూ ఉన్నారు.ఇక అలాంటి బాలకృష్ణ ఈ ఏడాది వీర సింహారెడ్డి ( Veera Simha Reddy ) సినిమాతో సంక్రాంతికి సూపర్ హిట్ మూవీని తన ఖాతాలో వేసుకున్నారు.
ఇక దసరాకి భగవంత్ కేసరి అనే సినిమాతో మన ముందుకు రాబోతున్నారు.ఇప్పటికే ఈ సినిమా చాలా వరకు కంప్లీట్ అయిపోయింది.

ఇక ఈ సినిమాలో శ్రీలీల,కాజల్ అగర్వాల్ ( Kajal Agarwal ) చేస్తున్నారు.ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలో బాలకృష్ణ గన్నవరం ఎయిర్ పోర్ట్( Gannavaram Airport ) లో కార్ నుండి దిగుతూ తన భుజాన వేసుకున్న బ్యాగ్ సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది.ఇక ఈ వీడియో చూసిన చాలా మంది నెటిజన్స్ ఒక సింహం మరో సింహాన్ని భుజాన వేసుకుంది అంటూ నందమూరి అభిమానులు కామెంట్లు పెట్టారు.ఎందుకంటే బాలకృష్ణ ని చాలామంది నందమూరి నటసింహం అని పిలుచుకుంటారు.
అలాగే ఈయన సినిమా టైటిల్లో కూడా సింహ అనే పేరు ఉంటే కచ్చితంగా ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఒక సెంటిమెంట్ కూడా టాలీవుడ్ లో ఉంది.అయితే అలాంటి బాలకృష్ణ తన భుజాన వేసుకున్న ఆ లయన్ బ్యాగ్ ధర ( Lion Bag Price )ఎంతో తెలిస్తే ఇప్పుడు మీరందరూ ఆశ్చర్య పోవాల్సిందే.

ఎందుకంటే అంత చిన్న బ్యాగు విలువ ఎంతంటే దాదాపు 25 వేల రూపాయలను తెలుస్తోంది.అయితే ఈ బ్యాగ్ ని 37% డిస్కౌంట్ తో 15,689 రూపాయలకు బాలకృష్ణ కొనుగోలు చేసినట్టు సమాచారం.అయితే అంత చిన్న బ్యాగు విలువ ఇంత రేటా అని ఈ విషయం తెలిసి చాలామంది నెటిజన్స్ నోరెళ్లబెడుతున్నారు.







