యాదాద్రి భువనగిరి జిల్లా:తాము బీఆర్ఎస్ పార్టీ( BRS party )లో ఉన్నా,ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హత ఉన్నా కేవలం పార్టీలోని సంపన్నులకు మాత్రమే పథకాలు అమలు చేస్తూ, అర్హులైన తమని రెండవ విడత,మూడో విడత అని మభ్యపెడుతూ వస్తున్నారని అడ్డగూడూరు మండల కేంద్రానికి చెందిన దళితులు సోమవారం నిరసనకు దిగారు.
ఈ స్పందర్భంగా వారు మాట్లాడుతూ అడ్డగూడూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన అర్హులైన దళితులకు దళిత బంధు( Dalit Bandhu ) ఇవ్వకుండా,నాయకులకు,అన్నీ ఉన్నోళ్లకు దళిత బంధు ఇచ్చారని, గృహలక్ష్మి పథకం( Gruhalakshmi Scheme )లో రెడ్డి సామాజిక వర్గానికి ఇళ్లు రాసుకున్నారని ఆరోపించారు.
బీఆర్ఎస్ పార్టీలో కూడా పేదలైన దళితులకు అన్యాయం చేస్తున్నారని అధికారులు చొరవ తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరారు.







