ఆస్ట్రేలియాపై వన్డే ఫార్మేట్ లో అత్యధిక వికెట్లు తీసిన రెండవ భారత బౌలర్ గా మహమ్మద్ షమీ సరికొత్త రికార్డు సృష్టించాడు.ఇటీవల జరిగిన తొలి వన్డే మ్యాచ్లో 10 ఓవర్లు బౌలింగ్ చేసి 51 పరుగులు ఇచ్చి ఏకంగా ఐదు వికెట్లు తీశాడు.
తోలి వన్డేలో ఆస్ట్రేలియా ఆల్ అవుట్ అవ్వడంలో మహమ్మద్ సమీ కీలక పాత్ర పోషించాడు.దీంతో తొలి వన్డేలో భారత్ ఆరు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా పై ఘనవిజయం సాధించింది.
వన్డే క్రికెట్ లో ఆస్ట్రేలియాపై అత్యధిక వికెట్లు తీసిన టాప్-5 భారత బౌలర్లు ఎవరు చూద్దాం.
కపిల్ దేవ్: భారత జట్టు మాజీ ఆల్ రౌండర్ కపిల్ దేవ్( Kapil Dev ) ఆస్ట్రేలియా తో 41 వన్డేలు ఆడి, 45 వికెట్లు తీశాడు.ఆస్ట్రేలియాపై అత్యధిక వికెట్లు తీసిన భారత జట్టు బౌలర్ గా నిలిచాడు.
మహమ్మద్ షమీ:( Mohammed Shami ) ఇటీవలే మొహలీ వేదికగా జరిగిన వన్డే మ్యాచ్లో ఆస్ట్రేలియాపై ఐదు వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన భారత జట్టు రెండో బౌలర్ గా నిలిచాడు.ఆస్ట్రేలియా తో 32 వన్డే మ్యాచ్లు ఆడి 37 వికెట్లు పడగొట్టాడు.

అజిత్ అగార్కర్:( Ajit Agarkar ) భారత జట్టు మాజీ బౌలర్ అజిత్ అగార్కర్ ఆస్ట్రేలియాతో 21 వన్డే మ్యాచులు ఆడి 36 వికెట్లు పడగొట్టి మూడవ స్థానంలో ఉన్నాడు.

జవగల్ శ్రీనాథ్:( Javagal Srinath ) శ్రీనాథ్ కు మైసూర్ ఎక్స్ ప్రెస్ గా ప్రత్యేక గుర్తింపు ఉంది.శ్రీనాథ్ ఆస్ట్రేలియా తో 29 మ్యాచ్లు ఆడి 33 వికెట్లు తీశాడు.

హర్బజన్ సింగ్: ( Harbhajan Singh )భారత జట్టు మాజీ స్టార్ బౌలర్ హర్భజన్ సింగ్ ఆస్ట్రేలియా తో 35 వన్డేలు ఆడి 32 వికెట్లు తీశాడు.ఈ జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు.







