భారతదేశ సముద్ర చరిత్రను 75 ప్రముఖ లైట్‌హౌస్‌ల ద్వారా జరుపుకునే లక్ష్యంతో “ఇండియన్ లైట్‌హౌస్ ఫెస్టివల్”( Indian Lighthouse Festival ) ఒక కొత్త కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.ఈ ఫెస్టివల్ మొదటి ఎడిషన్‌ను కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రి సర్బానంద సోనోవాల్ గోవాలో( Goa ) ప్రారంభించారు.
చారిత్రాత్మక లైట్‌హౌస్‌లను మళ్లీ కొత్తగా అందుబాటులోకి తేవడం, వాటిని విద్యా, సాంస్కృతిక, పర్యాటక హాట్‌స్పాట్‌లుగా ప్రపంచానికి అందించడం ఈ పండుగ లక్ష్యం.పోర్ట్స్, షిప్పింగ్ వాటర్‌వేస్ మంత్రిత్వ శాఖ ఈ లైట్‌హౌస్‌లను ప్రపంచ స్థాయి పర్యాటక ఆకర్షణలుగా మార్చడానికి ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యాలను ప్రోత్సహిస్తోంది.
ఈ తొలి పండుగలో సాంస్కృతిక ప్రదర్శనలు, సముద్ర చరిత్ర గురించి సెషన్లు, శాస్త్రీయ ప్రదర్శనలు, లైట్ షోలు ప్రదర్శించారు.ప్రముఖ సింగర్స్ పాటలు కూడా పాడారు.
మరో మాటలో చెప్పాలంటే, ఇండియన్ లైట్‌హౌస్ ఫెస్టివల్ అనేది భారతదేశ లైట్‌హౌస్‌ల వేడుక, దేశ సముద్ర చరిత్రలో( Indian Maritime History ) వాటి ముఖ్యమైన పాత్రను గుర్తు చేసుకునే ఒక పండుగ.లైట్‌హౌస్‌లను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావడం, వాటిని పర్యాటక ప్రాంతాలుగా ప్రచారం చేయడం ఈ పండుగ లక్ష్యం.
“గోవాలోని ఫోర్ట్ అగ్వాడాలో( Fort Aguada ) మొట్టమొదటి భారతీయ లైట్‌హౌస్ ఫెస్టివల్‌ను సీఎం ప్రమోద్ సావంత్, కేంద్ర మంత్రి శ్రీపాద్ నాయక్‌తో కలిసి ప్రారంభించడం సంతోషంగా ఉంది.సముద్ర నావిగేషన్‌లో ముఖ్యమైన భాగమైన లైట్‌హౌస్‌లను సెలెబ్రేట్ చేసుకోవడానికి ఇండియన్ లైట్‌హౌస్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు.లైట్‌హౌస్‌లు శతాబ్దాలుగా ఓడలు, పర్యాటకులను వాటి రహస్య, సుందరమైన అందాలతో ఆకర్షించే ప్రత్యేకమైన నిర్మాణాలు.” అని మంత్రి సర్బానంద సోనోవాల్ తాజాగా ట్వీట్ చేశారు.