సూర్యాపేట జిల్లా:ఖరీఫ్ సీజన్లో వర్షాలు సకాలంలో పడక ఎండిపోతున్న పంటలు ఒకవైపు,అకాల వర్షాలతో పంటలు నష్టపోతున్న పరిస్థితి మరోవైపు ఉందని,రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పంట భీమా సౌకర్యం కల్పించాలని జన సమితి పార్టీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు,కోదాడ నియోజకవర్గ కోఆర్డినేటర్ నారబోయిన కిరణ్ కుమార్ ముదిరాజ్ డిమాండ్ చేశారు.ఆదివారం సూర్యాపేట జిల్లా మోతె మండల కేంద్రంలో పత్తి సాగు చేసిన రైతులను కలిసి సాగు వివరాలను తెలుసుకున్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడి పని చేసిన రైతులకు ప్రకృతి కరుణించక పంటలు నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు.రైతు బీమా లాగే పంటల భీమా కూడా కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో రైతులు వెంకన్న,మల్లయ్య, నాగరాజు,సోమయ్య, సూర్యాపేట జిల్లా యువజన విభాగం అధ్యక్షులు యాకోబు రెడ్డి, లోకేష్ వినయ్ తదితరులు పాల్గొన్నారు.