ప్రస్తుత సమాజంలో చాలామంది ప్రజలు మొటిమల( Pimples ) సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.కొన్నిసార్లు మొటిమలు పెరిగితే మరికొన్నిసార్లు తగ్గుతాయి.
మొటిమలతో నిండిన మొహం అందన్ని పాడు చేయడమే కాకుండా బాధను కూడా కలిగిస్తుంది.ముఖ్యంగా చెప్పాలంటే పురుషుల కంటే మహిళలకు మొటిమల సమస్య ఎక్కువగా ఉంటుంది.
మొటిమలను వదిలించుకోవడానికి మార్కెట్లో సౌందర్య సాధనాలు నుంచి ఇంటి నివారణల వరకు చాలా ఉంటాయి.అయితే ఎంత చేసినా మొటిమలను వదిలించుకోవడం అంత సులభమైన పని కాదు.
నిజానికి మొటిమల కారణాలలో ఒకటి అపరిశుభ్రమైన చర్మం అని కచ్చితంగా చెప్పవచ్చు.
చర్మాన్ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి.అంతేకాకుండా మొటిమలను వదిలించుకోవడానికి ఏ ఇతర నియమాలను అనుసరించాలో ఇప్పుడు తెలుసుకుందాం.సాధారణంగా దుస్తులు ఉతకడం లాగే పిల్లో కేసులు కూడా శుభ్రం చేసుకుంటూ ఉండాలి.
దిండు కవర్ మీద మురికి పేరుకుపోవడం వల్ల అక్కడి నుంచి బ్యాక్టీరియా( Bacteria ) పుడుతుంది.నిద్రపోతున్నప్పుడు కవర్ పై ఉండే బ్యాక్టీరియా మన చర్మం లోనికి వెళ్తుంది.
ఇది మొటిమల సమస్యలను కలిగిస్తుంది.మొటిమల సమస్య రాకుండా ఉండాలంటే కనీసం వారానికి ఒక్కసారి పిల్లో కవర్లను( Pillow covers ) శుభ్రం చేసుకుంటూ ఉండాలి.
చాలా సార్లు అలసిపోయి ఇంటికి తిరిగి వచ్చి మేకప్ తీయకుండా నిద్రపోతూ ఉంటారు.
రాత్రిపూట మేకప్ తీయకపోవడం వల్ల చర్మ రంధ్రాలు మూసుకుపోయేలా చేస్తుంది.మొటిమలకు ఇది కూడా ఒక కారణం అవుతుంది.ఇంకా చెప్పాలంటే చాలామందికి బోర్లా నిద్రపోయే అలవాటు ఉంటుంది.
ఈ విధంగా నిద్రపోతున్నప్పుడు దిండు నేరుగా చర్మానికి రుద్దుకుంటుంది.చర్మం దిండు మధ్య రాపిడి రాత్రంతా కొనసాగితే మొటిమల సమస్య పెరిగే అవకాశం ఉంది.
ఇంకా చెప్పాలంటే రోజంతా చర్మంపై చాలా దుమ్ము పెరుగుతుంది.రాత్రి నిద్ర పోవడానికి ముందు ఫేస్ వాష్ తో మొఖాన్ని శుభ్రం చేసుకోవడం ఎంతో మంచిది.
అలాగే ఫేస్ వాష్( Face wash ) తో ముఖాన్ని కడిగిన తర్వాత మురికి టవల్ తో ముఖాన్ని తుడుచుకోవడం వల్ల చర్మం మరింత దెబ్బతింటుంది.అందుకోసం శుభ్రమైన టవల్ తో మాత్రమే ముఖాన్ని తుడుచుకోవడం మంచిది.