చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా బీఆర్ఎస్ నేత మోత్కుపల్లి దీక్ష

హైదరాబాద్/యాదాద్రి భువనగిరి జిల్లా:మాజీ సీఎం,టీడీపీ( TDP ) అధినేత చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా మాజీ మంత్రి,బీఆర్ఎస్ నేత మోత్కుపల్లి నర్సింహులు( Motkupalli Narasimhulu ) ఆదివారం హైదరాబాద్‌ లోని ఎన్టీఆర్ ఘాట్‌లో దీక్ష నిరసన దీక్షకు దిగనున్నట్లు తెలుస్తోంది.చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని, ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

 Brs Leader Motkupalli Narasimhulu Initiation In Protest Against Chandrababu's A-TeluguStop.com

ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు దీక్ష చేయనున్నారు.నిన్న ఎన్టీఆర్ ఘాట్‌ను సందర్శించిన మోత్కుపల్లి ఎన్టీఆర్ సమాధికి నివాళులర్పించిన విషయం తెలిసిందే.

తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడి( Chandrababu Naidu )ని ఆంధ్రప్రదేశ్ సీఐడీ పోలీసుల అరెస్టును బీఆర్ఎస్ అధినేత ఇప్పటివరకూ ఖండించకపోవడంపై మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.రాజకీయాలకు అతీతంగా ఆ అరెస్టును ఖండించాల్సి ఉన్నదన్నారు.

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి అరెస్టులను ఖండించడం అవసరమని అభిప్రాయపడ్డారు.ఇప్పటివరకు ఈ అరెస్టు వ్యవహారంలో కేసీఆర్( CM kcr ) మౌనంగా ఉండడాన్ని అదే పార్టీకి చెందిన మోత్కుపల్లి నర్సింహులు ప్రశ్నించడం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube