మాదాపూర్ డ్రగ్స్ కేసులో ముగిసిన హీరో నవదీప్ విచారణ

హైదరాబాద్ లోని మాదాపూర్ డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ విచారణ ముగిసింది.దాదాపు ఆరు గంటల పాటు నవదీప్ ను యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారులు ప్రశ్నించారు.

 Investigation Of Hero Navdeep Concluded In Madapur Drug Case-TeluguStop.com

మాదాపూర్ కేసులో డ్రగ్స్ సప్లయర్ గా ఉన్న రామచందర్ తో ఉన్న పరిచయాలపై నవదీప్ ను పోలీసులు ప్రశ్నించారని తెలుస్తోంది.డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయనే కోణంలోనూ విచారించారు.

డ్రగ్స్ తీసుకోవడం తానెప్పుడో మానేశానని నవదీప్ చెప్పారు.రామచందర్ తో పది ఏళ్ల క్రితమే పరిచయం ఉందన్న ఆయన తాను ఎవరికీ డ్రగ్స్ అందించలేదని తెలిపారు.

ఈ క్రమంలో డ్రగ్స్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని నవదీప్ తెలిపారు.ఏడేళ్ల పాత ఫోన్ రికార్డులను కూడా పరిశీలించి ప్రశ్నించారని, రిమోట్ లింక్ ను ఇన్వెస్ట్ చేసి ప్రశ్నలు అడిగారని పేర్కొన్నారు.

నార్కోటిక్ బ్యూరో అధికారులు బాగా విచారణ చేస్తున్నారన్న ఆయన అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చినట్లు వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube