తెలంగాణలో టీఎస్పీఎస్సీ నిర్వహించిన గ్రూప్ -1 పరీక్ష రద్దుపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు.ఎగ్జామ్ ను రద్దు చేస్తూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టని తెలిపారు.
పరీక్ష రద్దుకు నైతిక బాధ్యత వహిస్తూ కేసీఆర్ సీఎంగా రాజీనామా చేయాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని కేసీఆర్ చేయలేదని మండిపడ్డారు.
బీఆర్ఎస్ పాలనలో మొత్తం 17 పేపర్లు లీక్ అయ్యాయన్న ఈటల ఇప్పటికైనా కేసీఆర్ మేల్కొని పాలనపై దృష్టి సారించాలని సూచించారు.







