Sirivennala Seetharama Sastry: సిరివెన్నెల పాట రాయాలంటే ఈ నియమాలు పాటించాల్సిందే !

వృత్తిని దైవంగా భావించేవారు ఎంతమంది ఉంటారు చెప్పండి.మహా అయితే పూజ చేసే పూజారులు లేదంటే భక్తులు తప్ప దైవంగా వృత్తిని భావించేవారు చాలా తక్కువే.

 Sirivennala Seetharama Sastry: సిరివెన్నెల పాట ర-TeluguStop.com

అది సినిమా ఇండస్ట్రీలో అయితే చెప్పాల్సిన అవసరం లేదు.వారి జీవితాలు అస్తవ్యస్తం గా ఉన్నట్టే వారి పనులు కూడా అంతే అస్తవ్యస్తంగా ఉంటాయి.

తెలుగు సినిమా ఇండస్ట్రీకి సిరివెన్నెల సీతారామశాస్త్రి( Sirivennala Seetharama Sastry ) గారు చేసిన సేవలు ఎవరు మర్చిపోలేరు.కానీ ఆయన పని చేసిన విధానం కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.

సినిమాకు పాట రాసామా డబ్బులు తీసుకున్న మా అని కాకుండా రాసే ప్రతి పాటకు ముందు ఆయన కొన్ని అలవాట్లను ఆచరించేవారు.

Telugu Lyrics, Tollywood-Movie

ఎవరైనా డిస్కషన్ కోసం వస్తే లేదంటే వేరే ఏదైనా క్యాచ్యువల్ విషయాలకు మాత్రమే ఆయన సరదాగా కూర్చునే వారు కానీ పాట రాయాలి అనుకున్నారంటే ఖచ్చితంగా పొద్దున్నే లేచి స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకొని మరి పాటలు రాసి ఇచ్చి పంపించే వారట.ఇలా ప్రతి నిమిత్తము ఆయన పాట విషయంలో ఖచ్చితంగా ఈ నియమాలను పాటించేవారట.అలాగే డబ్బులు ఇంతిస్తేనే పాట రాస్తాను లేదా అంత కావాలి అని ఏ రోజు డిమాండ్ చేయలేదట.

ఏ మేరకు పాటను( Song ) డిమాండ్ చేస్తుందో ఆ కథకు తగ్గట్టుగా లిరిక్స్( Lyrics ) రాసి మాత్రమే ఇచ్చేవారట సిరివెన్నెల.ఇక సిరివెన్నెల ఏదైనా పాట రాయాలంటే బయటకు ఎక్కడికి వెళ్లే అలవాటు లేదట.

Telugu Lyrics, Tollywood-Movie

కొంతమంది మానసికంగా ప్రశాంతంగా ఉంటే తప్ప రాయలేరు మరి కొంతమంది హిల్ స్టేషన్ లేదా ఊటీ గోవా లాంటి ప్రదేశాలకు వెళ్లి పాటలు రాస్తూ ఉంటారు కానీ సిరివెన్నెల( Sirivennala ) మాత్రం తన రూమ్ లోనే పూజ చేసుకుని పాట రాసి ఒకరోజు లేదా రెండు రోజుల్లోనే తన డెడ్ లైన్ పూర్తి చేసేవారట.పాట రాసిన తర్వాతే ఆయన స్మోక్ చేయడం లేదా డ్రింక్ తీసుకోవడం వంటివి చేసేవారట పాట రాయక ముందు లేదా రాస్తూ ఆయన ఎలాంటి అలవాట్లను ఫాలో అయ్యేవారు కాదట.ఈ విషయాలన్నీ సిరివెన్నెల సీతారామశాస్త్రి కుమారుడు ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడంతో బయటకు వచ్చాయి.సిరివెన్నెల కొన్నాళ్ల క్రితం అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి మనందరికీ తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube