టీడీపీ అధినేత చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై విజయవాడ ఏసీబీ కోర్టు తీర్పు ఇవాళ మధ్యాహ్నానికి వాయిదా పడింది.ఈ మేరకు మధ్యాహ్నం 2.30 గంటలకు ఏసీబీ కోర్టు తీర్పును వెలువరించనుంది.
స్కిల్ డెవపల్ మెంట్ స్కాం కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంతో ఆయన ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో స్కాంలో మరిన్ని వివరాలు బయటకు రావాలంటే చంద్రబాబును ఐదు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే.ఈ పిటిషన్ పై ఇరు పక్షాల నుంచి సుదీర్ఘ వాదనలు విన్న ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది.