చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై మధ్యాహ్నానికి తీర్పు వాయిదా
TeluguStop.com
టీడీపీ అధినేత చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై విజయవాడ ఏసీబీ కోర్టు తీర్పు ఇవాళ మధ్యాహ్నానికి వాయిదా పడింది.
ఈ మేరకు మధ్యాహ్నం 2.30 గంటలకు ఏసీబీ కోర్టు తీర్పును వెలువరించనుంది.
స్కిల్ డెవపల్ మెంట్ స్కాం కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంతో ఆయన ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో స్కాంలో మరిన్ని వివరాలు బయటకు రావాలంటే చంద్రబాబును ఐదు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే.
ఈ పిటిషన్ పై ఇరు పక్షాల నుంచి సుదీర్ఘ వాదనలు విన్న ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది.
నార్త్ ఈస్ట్ ఇండియన్‌ని దారుణంగా గేలి చేసిన పిల్లలు.. కలకలం రేపుతోన్న వైరల్ వీడియో..